అండర్ - 19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో యువభారత్ సత్తా చాటింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 233 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించలేకపోయింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా 45.4 ఓవర్లలో చివరి వికెట్ కోల్పోయి 188 పరుగులు చేసింది. రాజ్ భవా వేసిన బంతికి (45.4) అఫ్‌వ్యూ మయాండ ధుల్ చేతికి బంతిని అందించి ఔటయ్యాడు. మయాండ పెవిలియన్ దారి పట్టడం వల్ల భారత్‌కు విజయం దక్కింది. రాజ్ భవా 6.4 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
టీమ్‌ఇండియా జట్టులో సారథి యాష్ ధుల్ (82) అర్ధశతకంతో రాణించగా.. తంబే (35), రషీద్ (31), నిషాంత్ (27) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో రఘువన్ష్ 5, హర్నూర్ సింగ్ 1, రాజ్ బవా 13, దినేశ్ బనా 7, విక్కీ 9 పరుగులు చేశారు. సఫారీల బౌలర్లలో బూస్ట్ 3, మయాండ 2, బ్రెవిస్ 2.. లియామ్, మిక్కీ చెరో వికెట్ తీశారు.
దక్షిణాఫ్రికా జట్టులో దెవాల్డ్ బ్రెవిస్ అర్ధశతకం (65)తో రాణించగా.. సారథి జార్జ్ వాన్ హీర్‌డెన్ (36), వాలంటైన్ కె ఐటైమ్ (25), జీజే మ్యారీ, మాథ్యూ బోస్ట్ 8, ఆండ్లీ సైమ్‌లేన్ 6, ఆఫ్ వ్యూ మయాండ 5, మిక్కీ కోప్‌లాండ్ 1 పరుగులు చేయగా, లియామ్ ఆల్డర్ (17) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఇవీ చదవండి: