ETV Bharat / sports

మైదానంలో కుప్పకూలిన ఇద్దరు విండీస్ క్రికెటర్లు - మైదానంలోనే పడిపోయిన క్రికెటర్లు

ఉన్నట్టుండి క్రికెట్​ మైదానంలో కుప్పకూలారు వెస్టిండీస్​కు చెందిన ఇద్దరు క్రికెటర్లు. పాకిస్థాన్​తో మ్యాచ్​ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.

Chinelle Henry, Chedean Nation
చినెల్లె హెన్రీ, చెడియన్ నేషన్
author img

By

Published : Jul 3, 2021, 10:44 AM IST

ఆంటిగ్వా వేదికగా వెస్టిండీస్-పాకిస్థాన్​ మహిళా జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో ఉన్నట్టుండి విండీస్ ప్లేయర్లు మైదానంలోనే పడిపోయారు. పాక్​ బ్యాటింగ్​ సందర్భంగా ఫీల్డింగ్​లో ఉన్న విండీస్​ ప్లేయర్లు పది నిమిషాల వ్యవధిలో మైదానంలో కుప్పకూలారు. వెంటనే స్పందించిన మ్యాచ్ నిర్వాహకులు వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

"చినెల్లె హెన్రీ, చెడియన్​ నేషన్​.. అనే ఇద్దరు మహిళా క్రికెటర్లను వైద్య సాయం కోసం ఆస్పత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది" అని ఓ క్రీడా ఛానల్​ తెలిపింది. అయితే వారు పడిపోవడానికి గల కారణం మాత్రం తెలియలేదు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పాక్​.. ఆరు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 18 ఓవర్లలో 111 పరుగులుగా నిర్దేశించారు నిర్వాహకులు. ఫలితంగా డక్​వర్త్​ లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్​ విజయాన్ని అందుకొంది.

వాళ్లు త్వరగా కోలుకోవాలి..

స్పృహ తప్పి పడిపోయిన ఆటగాళ్లు త్వరగా కోలుకోవాలని పాకిస్థాన్​ మహిళా జట్టు కెప్టెన్ జవేరియా ఖాన్​ ఆకాంక్షించింది. వారిద్దరూ జులై 4న జరిగే మూడో టీ20 నాటికి అందుబాటులో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలాంటి విషాదకరమైన సంఘటనలు జరిగిన తర్వాత కూడా మూడో టీ20 నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న వెస్టిండీస్​ క్రికెట్​ను ప్రశంసించింది జవేరియా. యూరో కప్​ సందర్భంగా నెల మైదానంలో పడిపోయిన డెన్మార్క్​ ప్లేయర్​ క్రిస్టియన్​ ఎరిక్సన్​ను జవేరియా గుర్తు చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.