ETV Bharat / sports

యాషెస్​లో కరోనా కలవరం.. ఆసీస్ స్టార్ బ్యాటర్​కు పాజిటివ్​ - ట్రెవిస్ హెడ్​కు కరోనా

Travis Head Corona: యాషెస్ సిరీస్​లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిడ్ హెడ్​కు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

travis head Travis Head tests positive, ట్రెవిస్ హెడ్ కరోనా, యాషెస్ కరోనా, Ashes 2021 corona
travis head
author img

By

Published : Dec 31, 2021, 12:06 PM IST

Travis Head Corona: యాషెస్​లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్​కు పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో అతడు నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు హెడ్.

"దురదృష్టవశాత్తు హెడ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం అతడిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఐదో టెస్టులో ఆడతాడని భావిస్తున్నాం" అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

హెడ్​ గైర్హాజరితో మిచెల్ మార్ష్, నిక్ మాడిన్సన్, జోష్ ఇంగ్లిస్​కు జట్టు నుంచి పిలుపొచ్చింది. కానీ రిజర్వ్ ప్లేయర్​గా కొనసాగుతున్న ఉస్మాన్ ఖవాజాకే నాలుగో టెస్టు తుదిజట్టులో ఇతడి స్థానంలో చోటు దక్కే అవకాశం ఉంది.

ఇప్పటికే యాషెస్​లో ఏడుగురికి పాజిటివ్​గా తేలింది. ముగ్గురు సహాయ సిబ్బందితో పాటు నలుగురు కుటుంబ సభ్యులకు కరోనాగా నిర్ధరణ అయింది. కానీ టోర్నీలో ఓ ఆటగాడికి పాజిటివ్​ రావడం ఇదే తొలిసారి.

యాషెస్ సిరీస్​లో వరుసగా మూడు విజయాలతో ట్రోఫీని రిటెయిన్ చేసుకుంది ఆస్ట్రేలియా. నాలుగో టెస్టు జనవరి 5న సిడ్నీ వేదికగా ప్రారంభంకానుంది. చివరి టెస్టు 14 నుంచి 18 వరకు హోబర్ట్ మైదానంలో జరగనుంది.

ఇవీ చూడండి: హోటల్ సిబ్బందితో భారత ఆటగాళ్ల స్టెప్పులు.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.