ETV Bharat / sports

టీ20ల్లోనూ విరాట్, రోహితే టాప్​- లిస్ట్​లో ఉన్న టీమ్ఇండియా బ్యాటర్లు వీళ్లే! - Icc t20 rankings

Top 5 T20 Run Scorers In India : 2024 టీ20 వరల్డ్​కప్ మరో ఆరు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పొట్టి ఫార్మాట్​లో అత్యధిక పరుగులు బాదిన టాప్​- 5 టీమ్ఇండియా బ్యాటర్లెవరో తెలుసుకుందాం!

Top 5 T20 Run Scorers In India
Top 5 T20 Run Scorers In India
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 5:04 PM IST

Top 5 T20 Run Scorers In India : ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్​కు క్రేజ్ పెరిగిపోయింది. అయితే మరో ఆరు నెలల్లో టీ20 వరల్డ్​కప్ రానుంది. ఈ టోర్నీ కోసం ఆయా జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా కూడా అదే పనిలో ఉంది. అయితే ఈ పొట్టి ఫార్మాట్​లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు బాదిన టాప్ - 5 టీమ్ఇండియా బ్యాటర్లెవరో చూద్దాం.

  1. విరాట్ కోహ్లీ : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఫార్మాట్​తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తుంటాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్​లో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్​గా విరాట్ టాప్​లో కొనసాగుతున్నాడు. అతడు 107 ఇన్నింగ్స్​లో 137.96 స్ట్రైక్ రేట్​తో 4008 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
  2. రోహిత్ శర్మ: టీ20ల్లో భారత్​లోనే కాకుండా ఓవరాల్​గా అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ టీమ్ఇండియా కెప్టెన్ రోహత్ శర్మ. అతడు 140 ఇన్నింగ్స్​ల్లో 3853 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్​ కూడా రోహిత్ శర్మే.
  3. కేఎల్ రాహుల్ : టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పొట్టి క్రికెట్ ఫార్మెట్​లోనూ కీలకంగా మారాడు. ఐపీఎల్​లో అద్భుతంగా రాణించి టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న రాహుల్, మాజీ కెప్టెన్​ ధోనీ రిటైర్మెంట్ తర్వాత వికెట్ కీపర్​గా తన స్థానం సుస్తిరం చేసుకున్నాడు. ఇక టీ20 ఫార్మాట్​లో రాహుల్ 68 ఇన్నింగ్స్​లో 2265 పరుగులు చేసి, టీమ్ఇండియాలో టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాటర్​గా కొనసాగుతున్నాడు.
  4. సూర్యకుమార్ యాదవ్ : టీ20ల్లో అరంగేట్రం చేసిన కొన్నిరోజుల్లోనే ప్రపంచనెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు సూర్యకుమార్. 360 డిగ్రీల ఆటతో గ్రౌండ్​లో నలుదిక్కులా బౌండరీలు బాదుతూ టీ20ల్లో తనదైన మార్క్ క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు 54 మ్యాచ్​ల్లో ఏకంగా 173.37 స్ట్రైక్ రేట్​తో 1921 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
  5. శిఖర్ ధావన్ : సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ టీ20ల్లో ఎక్కువ పరుగులు బాదిన ఐదో బ్యాటర్​గా ఉన్నాడు. అతడు 54 మ్యాచ్​ల్లో 1759 పరుగులు చేశాడు. ధావన్ 126.36 స్ట్రైక్ రేట్​తో టీ20ల్లో 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

విరాట్, డికాక్, రోహిత్ - పరుగుల వరద పారించిన టాప్ 10 బ్యాటర్లు

Rohit Sharma Asia Cup 2023 : ఈ 'ఐదు' స‌చిన్ రికార్డుల‌ను రోహిత్ బ్రేక్ చేస్తాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.