Tim David IPL 2022: ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుతమ బౌలర్లలో ఒకడైన జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు సింగపూర్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్. తద్వారా తను తాను పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. "నెట్స్‌లో ఎదుర్కోవాలని నేను ఎదురుచూస్తున్న బౌలర్లలో ఒకడు బుమ్రా. అతను ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడు. కానీ అతడ్ని ఎదుర్కొని నన్ను నేను పరీక్షించుకోవడం చాలా గొప్పగా ఉంటుందని భావిస్తున్నాను. ఇందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది" అని టిమ్ పేర్కొన్నాడు.
"ముంబయి ఇండియన్స్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఇంత విజయవంతమైన జట్టులో చోటు లభించడం చాలా గొప్ప విషయమని నేను భావిస్తున్నాను. ముంబయి ఫ్రాంచైజీ తమ ఆటగాళ్లను ఎలా చూసుకుంటుందనే దాని గురించి గొప్పగా విన్నాను. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మంచి ప్రదర్శన చేయడానికి ఎప్పుడూ అవకాశముంటుంది. ఏదేమైనా చాలా ఆనందంగా ఉంది" అని టిమ్ తెలిపాడు. కీరన్ పోలార్డ్, రోహిత్ శర్మ వంటి గొప్ప ఆటగాళ్లతో ఆడబోతున్నందుకు ఆనందంగా ఉందన్న టిమ్.. తన ఆటతీరును మెరుగు పరుచుకునేందుకు ఇదో గొప్ప అవకాశమని చెప్పాడు.
Tim David IPL Price
టిమ్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబయి ఇండియన్స్ భారీ ధరకు ముంబయి సొంతం చేసుకుంది. రెండోరోజు జరిగిన వేలంలో రూ.8.25 కోట్లు చెల్లించి అతడిని దక్కించుకుంది. కాగా అంతర్జాతీయంగా 14 టీ20 మ్యాచ్‌లు ఆడిన టిమ్.. 46.50 సగటుతో 558 పరుగులు చేశాడు. బౌలింగ్ విషయానికి వస్తే 14 టీ20ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. పలు దేశాల్లో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్‌లో అదరగొడుతున్నాడు.
IPL 2022 Mumbai Indians Squad
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, డెవాల్డ్ బ్రెవిస్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, ఎన్ తిలక్ వర్మ, సంజయ్ యాదవ్, జోఫ్రా ఆర్చర్, డేనియల్ సామ్స్, టైమల్ మిల్స్, టిమ్ డేవిడ్, రిలే మెరెడిత్, మొహమ్మద్ అర్షద్ ఖాన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, రమణదీప్ సింగ్, రాహుల్ బుద్ధి, హృతిక్ షోకీన్, అర్జున్ తెందుల్కర్, ఆర్యన్ జుయల్, ఫాబియన్ అలెన్.
ఇదీ చూడండి: IPL 2022: ఈసారి బరిలో నిలిచే తుది జట్లు ఇవేనా?