ఐపీఎల్లో తాము ఆడిన జట్టుకి ప్రాతినిధ్యం వహించకుండా.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన, వ్యవహరించబోతున్న ప్లేయర్లు ఎవరో తెలుసా? వారి గురించి ఓ సారి తెలుసుకుందామా మరి.
అజింక్యా రహానే..
Ajinkya Rahane Captain : అజింక్య రహానే ఈ పేరును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2011 నుంచి 2015 వరకు భారత్ జట్టులో అజింక్యా రహానే రెగ్యులర్ ప్లేయర్. నిలకడైన ఆటతో రహానే ఆకట్టుకోవడం వల్ల 2015లో భారత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అతడికి లభించింది. జింబాబ్వేతో జరిగిన 3 వన్డేల సిరీస్, T20లకు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డే సిరీస్‌ను ఇండియా వైట్‌వాష్ చేయగా.. టీ20 సిరీస్‌ను సమం చేసింది. ఈ సిరీస్‌తో రహానేకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే 2018లో బాల్‌టాంపరింగ్ ఆరోపణలతో అప్పటి రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో అజింక్యా రహానేను కెప్టెన్‌గా నియమించింది ఆర్ఆర్ యాజమాన్యం. IPLలో రహానే 24 మ్యాచ్‌లకు రాయల్స్‌కు నాయకత్వం వహించాడు. అందులో తొమ్మిది మ్యాచుల్లో విజయం సాధించగా.. 15 మ్యాచ్‌లో ఓటమిపాలైంది.ఇలాగే 2023 ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున మిడిలార్డర్లో అజింక్యా రహానే అదరగొట్టాడు.
జస్పీత్ బుమ్రా..
Jasprit Bumrah Captain : జస్పీత్ బుమ్రా.. తనదైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. 2013 నుంచి ముంబయి ఇండియన్స్ టీమ్‌లో కీలక ఆటగాడు. ఆ జట్టు విజయాల్లో జస్పీత్ బుమ్రా చాలా సార్లు కీలకపాత్ర పోషించాడు కూడా. అతడు ముంబయి తరఫున ఆడిన 120 మ్యాచుల్లో 145 వికెట్లు పడగొట్టాడు. కీలక ప్లేయర్ ఉన్న బుమ్రాకు ముంబయి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రాలేదు. అయితే 2022లో ఇంగ్లాండ్-భారత్ మధ్య జరిగిన ఐదవ టెస్ట్‌కు గాయం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అయ్యాడు. అతడి స్థానంలో జస్పీత్ బుమ్రాను కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది.
రుతురాజ్ గైక్వాడ్..
Ruturaj Gaikwad Captain : రుతురాజ్ గైక్వాడ్.. చెన్నై ఓపెనర్‌గా అందరికీ సుపరిచితుడే. ఇటీవల ఆసియా క్రీడలకు వెళ్లే జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఆ జట్టుకు రుత్‌రాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2023 సీజన్లో రుత్‌రాజ్ చెన్నై తరఫున ఓపెనర్‌గా దిగి అదరగొట్టాడు. 15 ఇన్నింగ్స్‌లలో 590 పరుగులు సాధించాడు.