శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే లంక ప్రీమియర్ లీగ్‌లో కొనసాగుతానని సోమవారం స్పష్టం చేశాడు.
పెరీరా.. కెరీర్లో ఆరు టెస్టులు(203 పరుగులు, 11వికెట్లు), 166 వన్డేలు(2338, 175), 84 టీ20లు(1204, 51) ఆడాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్‌కింగ్స్, కొచి టస్కర్స్ కేరళ, రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ లీగ్‌లో మొత్తంగా 37 మ్యాచులు ఆడి 422 పరుగులు చేసి 31 వికెట్లు తీశాడు . 2014లో టీ20 ప్రపంచకప్ విజయంలోనూ భాగస్వామ్యమయ్యాడు.
ఇదీ చూడండి: భారత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా విరాళం