ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని పలుమార్లు ఔట్ చేశాడు ఫాస్ట్ బౌలర్ అండర్సన్(Kohli vs James Anderson). ఈ విషయం(James Anderson News) బాగా చర్చనీయాంశమైంది. తాజాగా దీనిపై మాట్లాడిన అండర్సన్.. ఈ ఏడాది విరాట్‌తో పోటీపడ్డ తీరు ఎప్పటికీ తన ఫేవరెట్ అని పేర్కొన్నాడు. ఎన్నటికీ మరిచిపోలేనిదని చెప్పాడు.
"గత కొన్నేళ్లుగా విరాట్‌కు నాకు గట్టి పోటీ కొనసాగుతోంది. ఈ ఏడాది పోరు మాత్రం ఎప్పటికీ నా ఫేవరెట్‌గా నిలిచిపోతుంది. ఇంగ్లాండ్, భారత్.. వేదిక ఏదైనా కోహ్లీతో పోటీ పడటం ఆసక్తికరంగా ఉంటుంది. అతడిని చాలా సార్లు పెవిలియన్‌కు పంపాను. నా ఓవర్లో అతడు పరుగులు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది పరస్పరం గౌరవంతో కూడుకున్న పోటీ. ఇది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది."
-- అండర్సన్, ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్.
డిసెంబరులో జరగనున్న యాషెస్ సిరీస్‌పై(Ashes 2021) మాట్లాడిన అండర్సన్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. ఓ బౌలర్‌గా తాను ఉత్తమ బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయాలనే ఎదురుచూస్తానని తెలిపాడు. యాషెస్‌లో తాను అన్నీ మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని, మూడు లేదా నాలుగు టెస్టులు ఆడితే సరిపోతుందని అన్నాడు.
ఇదీ చదవండి: