ETV Bharat / sports

IPL​ మినీ వేలానికి ఆ టీమ్​ఇండియా సీనియర్​ ప్లేయర్లు దూరం.. ఎవరెవరంటే? - ఐపీఎల్​ మినీ వేలం 2023 తేది

IPL 2023 Mini Auction : ఐపీఎల్​ 2023 మినీ వేలానికి సమయం దగ్గర పడింది. అన్ని ఫ్రాంచైజీలు తమ ఖాళీలను భర్తీ చేసుకునేందుకు.. సరైన ప్లేయర్ల కొనుగోలుకు లెక్కలు వేసుకుంటున్నాయి. కాగా, ఈసారి వేలానికి కొందరు టీమ్​ఇండియా టాప్​ క్రికెటర్స్​ దూరమయ్యారు. వారెవరంటే?

IPL 2023 mini Auction
IPL 2023 mini Auction
author img

By

Published : Dec 18, 2022, 3:57 PM IST

IPL 2023 Mini Auction : ఐపీఎల్ 2023 మినీ​ వేలానికి సమయం ఆసన్నమైంది. డిసెంబర్​ 23న కొచ్చి వేదికగా జరగనున్న ఈ వేలంలో 405 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో కేవలం 87 ఖాళీలను మాత్రమే ఫ్రాంచైజీలు భర్తీ చేసుకోనున్నాయి. మిగతా 318 ప్లేయర్లు అన్​సోల్డ్​గా మిగిలిపోనున్నారు.

అయితే మొదట 991 మంది వేలానికి రిజిస్టర్​ చేసుకున్నారు. అందులోంచి ఫ్రాంచైజీల ఇంట్రెస్ట్​ ప్రకారం లిస్టును 405కు కుదించారు. అందులో టాప్​ విదేశీ ప్లేయర్లు మెహెడి, మార్టిన్​ గప్తిల్​, కోలిన్, బెన్​ కట్టింగ్​లకు చోటు దక్కలేదు. దాంతో పాటు ఈ టాప్​ ఇండియన్​ ప్లేయర్స్​కు కూడా ఆ జాబితాలో చోటు లభించలేదు.

1. కేదార్​ జాదవ్
బెంగుళూరు ఆల్​రౌండర్ కేదార్​ జాదవ్​ కూడా ఐపీఎల్​ మినీ వేలంలో ప్లేయర్ల జాబితాలో లేడు. చివరి సారిగా జాదవ్​.. 2020లో న్యూజిలాండ్​తో జరిగిన వన్డే మ్యాచ్​లో ఆడాడు. అప్పటి నుంచి పేలవ ప్రదర్శన కనబర్చాడు. ఐపీఎల్​లో 80 ఇన్నింగ్స్​లో 22.15 సగటుతో 1196 పరుగులు సాధించిన రికార్డు కూడా.. ఫ్రాంచైజీలు అతడిని పరిగణనలోకి తీసుకోకుండా ఆపలేదు. ఇంతక ముందు దిల్లీ క్యాపిటల్స్, కొచ్చి టస్కర్స్​ కేరళ, బెంగుళూరు, సీఎస్​కే, సన్​రైజర్స్​ తరఫున ఆడిన జాదవ్.. 2022 ఐపీఎల్​ మెగా వేలంలో అమ్ముడు పోలేదు. ఆ తర్వాత మినీ వేలం జాబితాలో కూడా ఫ్రాంచైజీలు అతడిని పరిగణలోకి తీసుకోలేదు.

IPL 2023 mini Auction
కేదార్​ జాదవ్

2. ఛెతేశ్వర్​ పుజారా
ఇటీవల బంగ్లాతో జరిగిన టెస్టు సెంచరీలో అద్భుత ప్రదర్శన చేసిన పుజారా.. ఈసారి వేలంలో పాల్గొనలేదు. చివరగా 2014లో పంజాబ్​ కింగ్స్​ తరఫున ఆడాడు పుజారా. 2021లో సీఎస్​కే తీసుకున్నా.. ఒక్క మ్యాచ్​లో కూడా ఆడించలేదు. 2022లో కూడా పుజారా అమ్ముడు పోలేదు. దీంతో ఈసారి వేలానికి రిజిస్టర్​ చేసుకోలేదు. ఇంతకముందు పుజారా.. పంజాబ్​ కింగ్స్​, బెంగుళూరు, కోల్​కతా, సీఎస్​కే తరఫున జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

IPL 2023 mini Auction
ఛెతెశ్వర్​ పుజారా

3. హనుమ విహారి
టీమ్ఇండియా టెస్టు క్రికెట్​ కీలక ఆటగాడు హనుమ విహారి. ఇతడు కూడా ఈసారి మినీ వేలానికి రిజిస్టర్​ చేసుకోలేదు. ఇంతవరకు ఐపీఎల్​లో 2019లో దిల్లీ క్యాపిటల్స్​కు ఆడాడు. ఆ తర్వాత సన్​రైజర్స్​ హైదరాబాద్​ తరఫున ఆడాడు. ఇప్పటివరకు ఐపీఎల్​లో 23 ఇన్నింగ్స్​ ఆడిన హనుమ విహారి.. 14.2 సగటు, 88.47 స్ట్రైక్​ రేట్​తో 284 పరుగులు చేశాడు.

IPL 2023 mini Auction
హనుమ విహారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.