ETV Bharat / sports

సెంచరీ జస్ట్​ మిస్​, 44 బంతుల్లో 9 సిక్సర్లతో బ్యాటర్​ వీరవిహారం - డేవిడ్​ మలాన్ రికార్డుు

ఇంగ్లాండ్ టీ20 జ‌ట్టు స్టార్ బ్యాటర్​ డేవిడ్ మ‌లాన్ మ‌రోసారి త‌న విశ్వ‌రూపం చూపించాడు. బ్యాట్ నుంచి ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు. 44 బంతుల్లో 9 సిక్సర్లు బాదాడు. 98 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

dawid malan
dawid malan
author img

By

Published : Aug 14, 2022, 1:41 PM IST

Dawid Malan: ఇంగ్లాండ్‌ వేదికగా జరుగుతున్న హండ్రెడ్‌ టోర్నమెంట్‌లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. 100 బంతుల్లో ముగిసే మ్యాచ్‌ అయినందున అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాటర్లు.. సిక్సర్లు, బౌండరీలతో మైదానాలను హోరెత్తిస్తున్నారు. తాజాగా మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్‌ రాకెట్స్‌ బ్యాటర్‌ డేవిడ్‌ మలాన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

రెండు పరుగుల తేడాతో సెంచరీ మిస్​ అయినా.. నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు మలాన్​. 44 బంతుల్లో 98 పరుగులు చేసిన అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 9 సిక్సర్లు ఉండడం విశేషం.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. బ్యాటర్లు సాల్ట్‌ 70 పరుగులు చేయగా, జాస్‌ బట్లర్‌ 41 పరుగులు సాధించాడు. చివర్లో స్టబ్స్‌ 10 బంతుల్లో 4 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. అనంతరం ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు 94 బంతుల్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

ఇవీ చదవండి: ప్రధాని మోదీ ఇచ్చిన ప్రేరణతోనే రెజ్లింగ్​లో పతకం గెలిచా

కరోనా వ్యాక్సిన్​ వేసుకోని జకోవిచ్ యూఎస్​ ఓపెన్​లో​ ఆడనున్నాడా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.