కొవిడ్ బాధితులను కాపాడే క్రమంలో వైద్యుల ముఖాల్లో కనిపిస్తున్న నిస్సహాయత తనను చంపేస్తోందని టీమ్‌ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. దేశవ్యాప్తంగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అశ్విన్ దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. పిల్లలు సహా తన కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో మధ్యలోనే టోర్నీని వీడాడు. చెన్నైకి వచ్చి తన కుటుంబ సభ్యులను చూసుకున్నాడు. మహమ్మారి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తెలుసు కాబట్టే కొవిడ్‌పై చురుగ్గా సామాజిక మాధ్యమాల్లో తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నాడు.
ఇదీ చదవండి: మాజీ క్రికెటర్ కిడ్నాప్.. విడుదల!
తాజాగా దిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో ప్రాణవాయువు సరఫరా లేకపోవడం వల్ల ఒక వైద్యుడు సహా 12 మంది కన్నుమూశారు. ఘటనకు సంబంధించి ఓ విలేకరి.. ఆ వైద్యశాల డైరెక్టర్ ఎస్‌సీఎల్ గుప్తాను ఇంటర్వ్యూ చేశారు. "నేనేం మాట్లాడలేకపోతున్నాను" అంటూ ఆ వైద్యుడు కన్నీటి పర్యంతం అయ్యారు. అప్పుడాయన ముఖంలో కనిపించిన నిస్సహాయత తనను చంపేసిందని అశ్విన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
-
💔Ada ponga da! That helplessness written all over that doctors face is killing me https://t.co/BLAjjJ6hQj
— This too shall pass, with masks and vaccine🇮🇳 (@ashwinravi99) May 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">💔Ada ponga da! That helplessness written all over that doctors face is killing me https://t.co/BLAjjJ6hQj
— This too shall pass, with masks and vaccine🇮🇳 (@ashwinravi99) May 4, 2021💔Ada ponga da! That helplessness written all over that doctors face is killing me https://t.co/BLAjjJ6hQj
— This too shall pass, with masks and vaccine🇮🇳 (@ashwinravi99) May 4, 2021
ఇదీ చదవండి: 'పీఎస్ఎల్ను యూఏఈలో నిర్వహించండి'