ETV Bharat / sports

Sachin: సచిన్​ నయా రికార్డ్​- ఈ శతాబ్దంలోనే టాపర్​ - కుమార సంగక్కర

21వ శతాబ్దపు టెస్ట్​ ఫార్మాట్​ గొప్ప బ్యాట్స్​మన్​గా సచిన్​ తెందుల్కర్​ నిలిచాడు. దీనిపై జరిగిన పోలింగ్​లో తెందుల్కర్​తో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్​ కుమార సంగక్కర పోటీలో ఉన్నాడు. చివరకు మాస్టర్​ బ్లాస్టర్​నే విజయం వరించింది.

Tendulkar, voted greatest Test batsman of 21st century
సచిన్ తెందుల్కర్, 21వ శతాబ్దపు గొప్ప బ్యాట్స్​మన్
author img

By

Published : Jun 20, 2021, 3:59 PM IST

Updated : Jun 20, 2021, 5:42 PM IST

21వ శతాబ్దానికి సుదీర్ఘ ఫార్మాట్​లో గొప్ప బ్యాట్స్​మన్(greatest Test batsman)​గా సచిన్ తెందుల్కర్​(Sachin Tendulkar) నిలిచాడు. దీనిపై నిర్వహించిన ఓ సర్వేలో లిటిల్​ మాస్టర్​కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇందులో మాస్టర్​ బ్లాస్టర్​కు పోటీగా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర నిలిచాడు. అయినా చివరకు తెందుల్కర్​నే విజయం వరించింది.

"ఇది చాలా కఠినమైన విషయం. టెస్టుల్లో కుమార సంగక్కర, సచిన్ తెందుల్కర్​ ఇద్దరూ ఐకాన్లుగానే పేరు పొందారు. కానీ, 21వ శతాబ్దపు గొప్ప బ్యాట్స్​మన్​గా నేను మాత్రం సచిన్​కే ఓటు వేస్తాను."

-సునీల్ గావస్కర్, భారత క్రికెట్ దిగ్గజం.

టెస్ట్​ల్లో తెందుల్కర్​ మొత్తం 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు ఉన్నాయి. రన్స్​తో పాటు శతకాల పరంగా సచిన్​ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. పరుగుల విషయంలో అతనికి చేరువలో ఆసీస్​ మాజీ కెప్టెన్​ రికీ పాంటింగ్ దగ్గర్లో ఉన్నాడు. తెందుల్కర్​ కంటే 2,543 పరుగులు తక్కువగా నమోదు చేశాడు. ఇక సెంచరీల విషయానికొస్తే దక్షిణాఫ్రికా మాజీ ఆల్​రౌండర్​ జాక్వస్​ కలిస్​.. సచిన్​కు చేరువలో ఉన్నాడు. అతడు టెస్టుల్లో 45 శతకాలు బాదాడు.

కుమార సంగక్కర 38 సెంచరీల సాయంతో 12,400 రన్స్ చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ పోలింగ్​లో గావస్కర్​తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, ఇర్ఫాన్​ పఠాన్, ఆకాశ్ చోప్రా.. తదితరులు ఉన్నారు.

16 ఏళ్ల ప్రాయంలో ఆటలోకి అడుగుపెట్టిన సచిన్​.. ప్రపంచ క్రికెట్​పై తనదైన ముద్ర వేశాడు. విస్డెన్​ క్రికెటర్స్​ అల్మానాక్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన ప్రపంచ ఆల్​టైమ్​ XIలో చోటు సంపాదించిన ఏకైక భారత ఆటగాడు సచిన్.

ఇక 2002లో విస్డెన్​ క్రికెటర్స్​ అల్మానాక్ ప్రకటించిన ర్యాంకుల్లో.. ఆల్​టైమ్​ గొప్ప టెస్ట్​ బ్యాట్స్​మన్​ల జాబితాలో డాన్ బ్రాడ్​మన్​ తర్వాత తెందుల్కర్​ పేరును ప్రకటించారు. వన్డేల్లో వివ్​ రిచర్డ్స్​ తర్వాత సచిన్​ పేరును పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 10 Years Of Kohli: కోహ్లీకే ఆ టెస్టు రికార్డులు సాధ్యం

Last Updated : Jun 20, 2021, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.