ETV Bharat / sports

సచిన్ ఫొటోలు మార్ఫింగ్.. క్యాసినో ప్రకటనల్లో!

Sachin casino: తన ఫొటోలు మార్ఫింగ్ చేసి క్యాసినో ప్రకటనల్లో ఉండటంపై దిగ్గజ సచిన్ స్పందించారు. ఫేక్​ ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

sachin
సచిన్
author img

By

Published : Feb 24, 2022, 4:48 PM IST

తన ఫొటోను మార్ఫింగ్‌ చేసి క్యాసినోకు సంబంధించిన యాడ్లను సామాజిక మాధ్యమాల్లో ప్రమోట్‌ చేస్తున్నారని, దాంతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటివి చూడటం తనను మనోవేదనకు గురిచేశాయని చెప్పాడు. గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా తెందూల్కర్‌ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఈ సందర్భంగా తనపై జరిగే తప్పుడు ప్రచారాలను ఖండించాడు. ఈ విషయంపై తన లీగల్‌ టీమ్‌ చర్యలు చేపట్టిందని, అయితే ప్రజలకు తెలియజేయటం కూడా ముఖ్యమని భావించి తానే స్వయంగా దీని గురించి వెల్లడిస్తున్నట్లు పోస్టు చేశాడు.

sachin
సచిన్

'నేను క్యాసినోను ప్రోత్సహిస్తున్నట్లు అందుకు సంబంధించిన ప్రకటనల్లో నటించినట్లు సామాజిక మాధ్యమాల్లో నా ఫొటోలను దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. అయితే, నేనెప్పుడూ గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్లు లేదా మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలు, మద్యానికి సంబంధించిన వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రమోట్‌ చేయలేదు. నా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం తీవ్రంగా కలచివేసింది. దీనికి సంబంధించి నా లీగల్‌ టీమ్‌ చర్యలు చేపట్టినా.. ఆ విషయం ప్రజలకు తెలియజేయటం ముఖ్యమని భావించి మీతో పంచుకుంటున్నాను' అని సచిన్‌ విచారం వ్యక్తం చేశాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.