ETV Bharat / sports

పాక్​ రికార్డు బ్రేక్.. అగ్రస్థానంలో ​టీమ్​ఇండియా

Teamindia VS Westindies: వెస్టిండీస్​తో జరిగిన రెండో వన్డేలో టీమ్​ఇండియా విజయం సాధించడం వల్ల సిరీస్​ కూడా దక్కింది. అయితే ఈ విజయంతో భారత జట్టు ఓ అరుదైన రికార్డును సాధించింది. ఆదేంటంటే...

teamindia record
టీమ్​ఇండియా రికార్డు
author img

By

Published : Jul 25, 2022, 3:01 PM IST

Teamindia VS Westindies: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా విజయం సాధించడంతో 2-0తో సిరీస్‌ను కూడా సొంతం చేసుకొంది. దీంతో భారత జట్టు విండీస్‌పై ఓ అద్భుతమైన రికార్డు నమోదు చేసింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మరే జట్టుకు సాధ్యంకాని రీతిలో వరుసగా 12 సిరీస్‌లు కైవసం చేసుకొని ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గతంలో టీమ్‌ఇండియా.. పాకిస్థాన్‌తో సమానంగా 11 వరుస ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచింది. దాయాది జట్టు జింబాబ్వేపై 1996 నుంచి 2021 వరకు వరుసగా 11 సిరీస్‌లు సొంతం చేసుకుంది. ఇప్పుడు టీమ్‌ఇండియా దాన్ని అధిగమించింది.

వరుసగా అత్యధిక ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచిన జట్లు..

  • భారత్‌ x వెస్టిండీస్‌ (12 సిరీస్‌లు) 2007 - 2022 వరకు
  • పాకిస్థాన్‌ x జింబాబ్వే (11 సిరీస్‌లు) 1996 - 2021 వరకు
  • పాకిస్థాన్ x వెస్టిండీస్‌ (10 సిరీస్‌లు) 1999 - 2022 వరకు
  • దక్షిణాఫ్రికా x జింబాబ్వే (9 సిరీస్‌లు) 1995 - 2018 వరకు
  • భారత్‌ x శ్రీలంక (9 సిరీస్‌లు) 2007 - 2021 వరకు

300పై చిలుకు లక్ష్యాల్లో నమోదైన స్వల్ప వ్యక్తిగత అత్యధిక స్కోర్లు..

  • 64 నాటౌట్‌ అక్షర్‌ పటేల్‌ వెస్టిండీస్‌తో ఆడిన ఈ మ్యాచ్‌లోనే 312/8
  • 65 షోయబ్‌ మాలిక్‌ 2005లో టీమ్‌ఇండియాతో ఆడిన మ్యాచ్‌లో 319/7
  • 68 గౌతమ్‌ గంభీర్‌ 2008లో శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో 310/4

వెస్టిండీస్‌లో అత్యధిక వన్డే లక్ష్య ఛేదనలు..

  • 2019లో వెస్టిండీస్‌పై ఇంగ్లాండ్‌ 361 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
  • 2003లో వెస్టిండీస్‌పైనే శ్రీలంక 313 పరుగుల లక్ష్యాన్ని ఛేదింది.
  • 2022లో వెస్టిండీస్‌పై భారత్‌ 311 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

2002 నుంచి ఇప్పటివరకు ఛేదనల్లో 41 నుంచి 50 ఓవర్ల మధ్య అత్యధిక పరుగుల మ్యాచ్‌లు..

  • 2014లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 111 పరుగులు.
  • 2022లో న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులు.
  • 2005లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 102 పరుగులు.
  • 2022లో భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులు.

ఇదీ చూడండి: Commonwealth Games: కామన్​వెల్త్​ క్రీడల్లో మన ఆశాకిరణాలు వీరే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.