ETV Bharat / sports

IND VS SL: లంకతో సమరానికి టీమ్​ఇండియా సై

Teamindia VS Srilanka T20: సొంతగడ్డపై సిరీస్‌ల మీద సిరీస్‌లు గెలుస్తూ దూసుకెళ్తోంది టీమ్‌ఇండియా. టీ20 ప్రపంచకప్‌ తర్వాత న్యూజిలాండ్‌పై టెస్టులు, టీ20ల్లో సిరీస్‌లు సాధించిన భారత్‌.. తాజాగా వెస్టిండీస్‌ను వన్డేలు, టీ20ల్లో వైట్‌ వాష్‌ చేసింది. ఇప్పుడిక లంకేయుల పని పట్టడానికి సిద్ధమైంది రోహిత్‌ సేన. మూడు టీ20లు, రెండు టెస్టుల కోసం భారత గడ్డపై అడుగు పెట్టిన శ్రీలంక.. ముందుగా గురువారం పొట్టి ఫార్మాట్లో సిరీస్‌ను ఆరంభిస్తోంది. భారత్‌కు గాయాలు సమస్యగా మారినప్పటికీ.. సొంతగడ్డపై టీమ్‌ఇండియాను ఎదురొడ్డి సిరీస్‌ గెలవడం లంకకు తేలికైన విషయం కాదు.

Teamindia VS Srilanka T20 series
టీమ్​ఇండియా వర్సెస్​ శ్రీలంక
author img

By

Published : Feb 24, 2022, 6:50 AM IST

గాయాలతో కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌, దీపక్‌ చాహర్‌.. విశ్రాంతి కోసమని విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌ లాంటి కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ.. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారమే తొలి పోరు. సొంతగడ్డపై ఎదురైన ప్రతి జట్టునూ చిత్తు చేస్తూ దూసుకెళ్తున్న టీమ్‌ఇండియాను ఎదుర్కోవడం శ్రీలంకకు సవాలే అనడంలో సందేహం లేదు. ఆ జట్టు ఇటీవలే ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌లో 1-4తో ఓటమి చవిచూసింది. ఒకప్పటితో పోలిస్తే లంక బాగా బలహీన పడ్డ మాట వాస్తవం. జట్టులో నిలకడగా రాణించే ఆటగాళ్లు తక్కువైపోయారు. అయితే కుశాల్‌ మెండిస్‌, నిశాంక, చమీర, తీక్షణ లాంటి ప్రతిభావంతులున్న లంకను మరీ తక్కువ అంచనా వేస్తే ప్రమాదమే.

ఎవరికో ఛాన్స్‌?: టీ20 ప్రపంచకప్‌ దిశగా యువ ఆటగాళ్లను పరీక్షించడానికి ఈ సిరీస్‌ భారత్‌కు మరో అవకాశం. కోహ్లి సహా అరడజను మంది రెగ్యులర్‌ ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో ఎక్కువగా ఆడే ఛాన్స్‌ రాని ఆటగాళ్లను తుది జట్టులో చూడొచ్చు. శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లకు మరిన్ని అవకాశాలు లభించడం ఖాయం. పంత్‌ దూరం కావడంతో చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ సంజు శాంసన్‌ ఇప్పుడైనా తనేంటో రుజువు చేసుకుంటాడేమో చూడాలి. ప్రత్యామ్నాయ వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌ కిషన్‌ పోటీని తట్టుకుని ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోవాలంటే అతను నిలకడగా రాణించాల్సిందే. సంజును తొలి టీ20 నుంచే ఆడిస్తారా.. లేక ముందు ఇషాన్‌కు అవకాశమిచ్చి, తర్వాత అతడిని తుది జట్టులోకి తీసుకుంటారా అన్నది ప్రశ్న. పెద్దగా అవకాశాలు రాని దీపక్‌ హుడాను ఈ సిరీస్‌లో పూర్తి స్థాయిలో ఆడించే అవకాశముంది. పని ఒత్తిడి కారణంగా టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్లో ఏ సిరీస్‌ ఆడని బుమ్రా మళ్లీ ఈ సిరీస్‌లో బరిలోకి దిగుతున్నాడు. అతడితో భువనేశ్వర్‌ కొత్త బంతిని పంచుకునే అవకాశముంది. మూడో పేసర్‌గా నిలకడగా రాణిస్తున్న హర్షల్‌ పటేల్‌ను తుది జట్టులో కొనసాగిస్తారా.. సిరాజ్‌కు అవకాశమిస్తారా అన్నది చూడాలి. గాయంతో రెండు నెలలకు పైగా జట్టుకు దూరంగా ఉన్న రవీంద్ర జడేజా కూడా ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. చాహల్‌కు తోడుగా అతడికే తుది జట్టులో చోటిస్తారా.. రవి బిష్ణోయ్‌ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరం. బ్యాటింగ్‌ బలం పెరగాలనుకుంటే జడేజానే ఆడించొచ్చు. విండీస్‌తో చివరి టీ20లో మిడిలార్డర్లో ఆడి విఫలమైన రోహిత్‌.. ఈ మ్యాచ్‌లో రుతురాజ్‌తో కలిసి ఓపెనింగ్‌లోనే వచ్చే అవకాశముంది. కిషన్‌ లేదా శాంసన్‌ మూడో స్థానంలో ఆడతారు. శ్రేయస్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ రావచ్చు.

అతడితో జాగ్రత్త: భారత్‌తో పోలిస్తే శ్రీలంక బలహీనమే అయినా.. భారత పిచ్‌లను బాగా ఉపయోగించుకోగల స్పిన్నర్లు ఆ జట్టు సొంతం. ప్రపంచ మేటి స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హసరంగ.. కొవిడ్‌ కారణంగా సిరీస్‌కు దూరం కావడం లంకకు పెద్ద ఎదురుదెబ్బే. అయినప్పటికీ తీక్షణ రూపంలో లంక దగ్గర మరో ప్రమాదకర స్పిన్‌ ఆయుధం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాపై అతను చక్కటి ప్రదర్శన చేశాడు. అతడితో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇంకో ఇద్దరు స్పిన్నర్లు వాండర్సే, జయవిక్రమల మీదా ఓ కన్నేయాల్సిందే. ఇక పేసర్లలో చమీర, లహిరు కుమార నిలకడగానే రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో నిశాంక, కుశాల్‌ మెండిస్‌పై భారత బౌలర్లు దృష్టిసారించాలి. ఆస్ట్రేలియాపై వీళ్లిద్దరూ సత్తా చాటారు. చండిమాల్‌, అసలంక, గుణతిలక ఫామ్‌లో లేకపోవడంతో లంక ఇబ్బంది పడుతోంది. కెప్టెన్‌ శనక నుంచి ఆ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన ఆశిస్తోంది.

సూర్యకుమార్‌ దూరం: టీమ్‌ఇండియాలో గాయపడ్డ ఆటగాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. ఇప్పుడు ఈ జాబితాలో సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా చేరాడు. వెస్టిండీస్‌తో చివరి టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య.. చేతికి గాయం కావడం వల్ల శ్రీలంకతో గురువారం ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. ‘‘విండీస్‌తో మూడో టీ20 సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ సూర్య గాయపడ్డాడు. అతడి చేతి లోపల చీలిక వచ్చింది. గాయం నుంచి కోలుకోవడానికి సూర్య జాతీయ క్రికెట్‌ అకాడమీకి వెళ్తాడు’’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపాడు. సూర్య స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడెవరినీ బీసీసీఐ ఎంపిక చేయలేదు. విశ్రాంతి కోసమని కోహ్లి, పంత్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

హసరంగ ఔట్‌: భారత్‌తో టీ20 సిరీస్‌ ముంగిట శ్రీలంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొవిడ్‌ నుంచి కోలుకోకపోవడంతో ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ ఈ సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ మధ్యలో అతను కరోనా బారిన పడ్డాడు. అప్పట్నుంచి ఐసోలేషన్లో ఉంటున్న అతడికి తాజాగా కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా.. మళ్లీ పాజిటివ్‌ వచ్చింది. అతను కోలుకుంటే రెండో టీ20కైనా అందుబాటులోకి వచ్చేవాడు. కానీ తాజా పరీక్షల్లోనూ పాజిటివ్‌ రావడంతో ఆస్ట్రేలియాలోనే ఐసొలేషన్లో కొనసాగుతున్నాడు.

పిచ్‌

లఖ్‌నవూలోని అటల్‌ బిహారి ఏక్‌నా స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ నాలుగు టీ20 మ్యాచ్‌లు జరగ్గా అన్నింట్లోనూ మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. ఈ మైదానంలో అత్యధిక టీ20 స్కోరు 195/2. స్పిన్నర్లకు పిచ్‌ సహకరిస్తుంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌, రుతురాజ్‌, కిషన్‌/శాంసన్‌, శ్రేయస్‌, దీపక్‌ హుడా, వెంకటేశ్‌ అయ్యర్‌, జడేజా/బిష్ణోయ్‌, చాహల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, హర్షల్‌ పటేల్‌/సిరాజ్‌.
శ్రీలంక: కుశాల్‌ మెండిస్‌, నిశాంక, గుణతిలక, అసలంక, చండిమాల్‌, శనక, కరుణరత్నె, తీక్షణ, వాండర్సే, చమీర, లహిరు కుమార.

22

శ్రీలంకతో భారత్‌ ఆడిన టీ20లు. 14 నెగ్గి, 7 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. స్వదేశంలో శ్రీలంకతో 11 టీ20లు ఆడిన భారత్‌.. 8 గెలిచింది. రెండు మ్యాచ్‌ల్లో లంక నెగ్గింది. ఒకదాంట్లో ఫలితం రాలేదు.

ఇదీ చూడండి: IPL 2022: ఐపీఎల్​కు డేట్​ ఫిక్స్​- నాలుగు వేదికల్లో 70 మ్యాచ్​లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.