ETV Bharat / sports

సూర్య 'స్కై' షాట్ల వెనుక.. డైట్‌ సీక్రెట్‌ ఇదా? - సూర్యకుమార్​ యాదవ్ టీ20 వరల్డ్ కప్​

టీమ్​ఇండియా హీరో సూర్యకుమార్​ యాదవ్​ తన అదిరిపోయే షాట్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మరి ఆ అద్భుతాలు ఎలా సాధ్యమవుతున్నాయి అంటే.. సరైన ప్రణాళికతో పాటు తన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కూడా ఓ కారణమని చెపాడు. ఏం చెప్పాడంటే..

Teamindia cricketer Surya kumar yadav diet secret
సూర్య 'స్కై' షాట్ల వెనుక.. డైట్‌ సీక్రెట్‌ ఇదా
author img

By

Published : Nov 8, 2022, 12:50 PM IST

తాజా టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులను బెంబేలిస్తున్న క్రికెటర్​ ఎవరు? అదిరిపోయే షాట్లతో ధనాధన్​ అడుతుంది ఎవరు? అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సూర్యకుమార్​ యాదవ్​. ఎలాంటి బంతైనా సరే బౌలర్లపై విరుచుకుపడుతూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మైదానంలో ఈ అద్భుతాలు ఎలా సాధ్యమవుతున్నాయి అంటే.. సరైన ప్రణాళికతో పాటు తన ఆహారపు అలవాట్లను మార్చుకోవడం కూడా ఓ కారణమని చెపాడు స్కై. మరి సూర్య డైట్ సీక్రెట్స్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం..

ఈ ప్రపంచ నంబర్‌ టీ20 బ్యాటర్‌తో కలిసి పనిచేస్తోన్న ప్రముఖ డైటీషియన్‌, స్పోర్ట్స్‌ న్యూట్రిషనిస్ట్‌ శ్వేతా భాటియా.. సూర్య ఆహారపు అలవాట్ల గురించి మీడియాతో పంచుకున్నారు. గత ఏడాది కాలంగా శ్వేత బృందం సూర్యతో కలిసి పనిచేస్తోంది. ఫిట్‌నెస్‌ పెంచుకునే క్రమంలో స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌పై ఈ బ్యాటర్‌కు వీరు అవగాహన కల్పిస్తున్నారు. "ఐదు పాయింట్ల అజెండాతో సూర్య డైట్‌ను మేం తీర్చిదిద్దాం. అతడిలో చురుకుదనం పెంచేలా కార్బోహైడ్రేట్‌ ఫుడ్‌ తీసుకోవడాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించాం. సూర్య డైట్‌ నుంచి అధిక కార్బోహైడ్రేట్‌ పదార్థాలను తొలగించాం. నట్స్‌, ఒమెగా 3 ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఇస్తున్నాం. ఇక గుడ్లు, మాంసం, చేపల వంటి మాంసాహారం నుంచి అధిక స్థాయిలో ప్రొటీన్లు అందేలా చూస్తున్నాం. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాడు. అథ్లెట్‌కు హైడ్రేషన్‌ చాలా ముఖ్యం. అందుకే ఎలక్ట్రోలైట్‌లు ఉండే ద్రవాలు ఇస్తున్నాం. శిక్షణ, మ్యాచ్‌ల సమయంలో అతడి ప్రదర్శన పెంచేలా బూస్టింగ్‌ సప్లిమెంట్‌లు తీసుకుంటున్నాడు" అని శ్వేత వివరించారు.

వాటికి చాలా దూరం.. అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే కొన్ని సార్లు త్యాగాలు తప్పవు. ముఖ్యంగా అథ్లెట్లు ఆహార విషయంలో చిన్న చిన్న ఆనందాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఐస్‌క్రీమ్‌, బిర్యానీ, పిజ్జా వంటివి తినొద్దు. అయితే కొందరు చీట్‌ మీల్స్‌ పేరుతో వీటిని అప్పుడప్పుడు తీసుకుంటారు. కానీ ఈ విషయంలో సూర్య చాలా పర్‌ఫెక్ట్‌గా ఉంటాడని అంటున్నారు శ్వేత. డైట్ ప్రారంభించినప్పటి నుంచి జంక్‌ ఫుడ్స్‌ జోలికే వెళ్లడం లేదని చెబుతున్నారు. చీట్స్‌ మీల్స్‌కు దూరంగానే ఉంటాడట. ఒకవేళ ఎప్పుడైనా డైట్‌ వద్దని అనిపిస్తే.. చీట్‌ మీల్స్‌ను కూడా పక్కాగా ప్లాన్‌ చేస్తామని శ్వేత తెలిపారు. అతడి ప్రదర్శనపై ప్రభావం పడకుండా.. ఏ సమయంలో వాటిని తీసుకోవాలనేది చెబుతామని అన్నారు. ఇక సూర్య తరచుగా కెఫెన్‌ బూస్ట్‌ తాగుతాడు. 'కెఫెన్‌ ఒక పవర్‌ బూస్టర్‌. సూర్య తాగే పవర్‌ సప్లిమెంట్స్‌ డ్రింక్స్‌లో ఇది కూడా ఒకటి. అత్యంత శక్తిమంతంగా సూర్య షాట్లు కొట్టేందుకు ఈ బూస్టర్‌ సాయపడుతుంది' అని శ్వేత వివరించారు.

ఇదీ చూడండి: సెమీస్​ ముందు టీమ్​ఇండియాకు తప్పిన ప్రమాదం.. కెప్టెన్​ రోహిత్​కు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.