ETV Bharat / sports

IND Vs SA Test: టీమ్​ఇండియాకు అదే బలం.. మూడేళ్లుగా గొప్ప రికార్డులు! - టీమ్​ఇండియా వర్సెస్​ దక్షిణాఫ్రికా

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన టీమ్​ఇండియా ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు గెలుపుపైనా కన్నేసింది. ఈ మ్యాచ్​లోనూ గెలిస్తే భారత జట్టు చరిత్ర తిరగరాసినట్టవుతుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? భారత బౌలింగ్‌ యూనిట్‌గా ఎలా ఉంది? గతంలో విదేశాల్లో మన బౌలర్లు ఎలాంటి ప్రదర్శన చేశారు? వంటి విశేషాల సమాహారమే ఈ కథనం.

TeamIndia Bowling unit
టీమ్​ఇండియా
author img

By

Published : Jan 3, 2022, 2:36 PM IST

IND vs SA Test: మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్న భారత జట్టు ఎప్పుడూ అక్కడ సూపర్‌స్పోర్ట్‌ మైదానంలో విజయం సాధించిన సందర్భం లేదు. కానీ, కోహ్లీసేన ఇప్పుడు చరిత్ర తిరగరాసింది. తొలి టెస్టులో మొత్తం 18 వికెట్లు పడగొట్టిన భారత పేస్‌ దళం ఇప్పుడు రెండో మ్యాచ్‌పైనా కన్నేసింది. ఒకవేళ అక్కడా రాణిస్తే భారత్‌ సిరీస్‌ గెలవడం ఖాయం. దీంతో సఫారీ గడ్డపై తొలిసారి టీమ్‌ఇండియా చారిత్రక విజయం సాధించే సువర్ణావకాశం ఉంది.

TeamIndia Bowling unit
టీమ్​ఇండియా

ఇరు జట్ల ప్రస్తుత పరిస్థితి..

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ తేలిగ్గానే ఈ సిరీస్‌ కైవసం చేసుకునేలా కనిపిస్తున్నా దక్షిణాఫ్రికాను తక్కువ అంచనావేసే పరిస్థితి లేదు. సొంతగడ్డపై ఆ జట్టు ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకునే వీలుంది. ఎంగిడి, రబాడ లాంటి ప్రపంచ శ్రేణి పేసర్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో వారి నుంచి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా భారత జట్టులో ఓపెనర్లే పరుగులు చేయడం, మిడిల్‌ ఆర్డర్‌ చేతులెత్తేయడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆటగాళ్లంతా కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రస్తుతం బలహీనంగా ఉంది. అందులోనూ క్వింటన్‌ డికాక్‌ లాంటి వికెట్‌ కీపర్‌, బ్యాటర్లు టెస్టులకు వీడ్కోలు పలకడం వల్ల ఆ ఇబ్బంది మరింత పెరిగింది. దీంతో భారత బౌలర్లు చెలరేగితే దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పవనే చెప్పొచ్చు.

TeamIndia Bowling unit
టీమ్​ఇండియా

మేటి బౌలింగ్‌ యూనిట్‌గా భారత్‌..

ఇక రెండో టెస్టుకు ముందు భారత బౌలింగ్‌ బలం ఎలా ఉందని ఒకసారి పరిశీలిస్తే అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నాయి. కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా విదేశాల్లో మొత్తం 36 టెస్టులు ఆడగా.. అందులో పేస్‌ బౌలర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి మొత్తం 3,338.2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పేసర్లు.. 392 వికెట్లు సాధించి.. 51.0 అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌ నమోదు చేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్‌ బౌలింగ్‌ విభాగంలో ‘కోహ్లీసేన’ అగ్రస్థానంలో నిలిచింది. ఇక వివియన్‌ రిచర్డ్స్‌ నేతృత్వంలోని విండీస్‌ బౌలింగ్‌ యూనిట్‌ కోహ్లీసేన తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు విదేశాల్లో 26 మ్యాచ్‌లు ఆడగా.. 3,427 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పేస్‌ బౌలర్లు.. 398 వికెట్లు సాధించి.. 51.6 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నారు. ఆపై స్టీవ్‌వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా పేసర్లు.. 28 టెస్టుల్లో 2,591.2 ఓవర్లు బౌలింగ్‌ చేసి 286 వికెట్లు సాధించారు. దీంతో వారు 54.3 స్ట్రైక్‌రేట్‌ సాధించారు.

పది వికెట్లలోనూ మనోళ్లే టాప్‌..

సెంచూరియన్‌ టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో పేస్ బౌలర్లే మొత్తం పది వికెట్లు తీశారు. దీంతో విదేశాల్లో అత్యధికంగా ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన పేస్‌ బౌలింగ్‌ జాబితాలోనూ భారత్‌(పది సార్లు) అగ్రస్థానంలో నిలిచింది. 2018 నుంచీ కోహ్లీసేన సారథ్యంలోని బుమ్రా, షమి, ఇషాంత్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటీవల శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌ లాంటి యువకులు సైతం సీనియర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మెరుస్తున్నారు. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ పేసర్లు 6 సార్లు ఈ ఘనత సాధించి రెండో స్థానంలో నిలవగా.. న్యూజిలాండ్‌ బౌలర్లు నాలుగు సార్లు పది వికెట్లు తీసి మూడో స్థానంలో నిలిచారు. దీంతో ఎలా చూసినా భారత పేస్ బౌలింగ్‌ యూనిట్‌ సంపూర్ణంగా ఉంది. కచ్చితంగా రెండో టెస్టులోనూ టీమ్‌ఇండియా విజయం సాధించేలా కనిపిస్తోంది. మరో విశేషం ఏమిటంటే.. జోహెన్నెస్‌బర్గ్‌లో టీమ్‌ఇండియా ఇప్పటివరకూ ఒక్క టెస్టు కూడా ఓటమిపాలవ్వలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించగా.. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో టీమ్‌ఇండియా ఇక్కడే సిరీస్‌ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

TeamIndia Bowling unit
టీమ్​ఇండియా

ఇదీ చూడండి: IND Vs SA: టాస్ గెలిచిన టీమ్ఇండియా.. కోహ్లీ లేకుండానే బరిలోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.