ETV Bharat / sports

టీ20 ర్యాంకింగ్స్​లో భారత్​ టాప్.. ఉప్పల్​ విజయం ఇచ్చిన జోష్​తో... - టీమ్ ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్​ టాప్​

ICC T20 Rankings 2022 : టీ20 ర్యాంకింగ్స్​ను ప్రకటించింది ఐసీసీ. తాజాగా సిరీస్ గెలిచిన భారత్​ 268 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్​ 7 పాయింట్లు వెనుకబడిపోయి.. తర్వాతి స్థానంలో ఉంది. మిగతా టీమ్​ల ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి..

icc t20 rankings 2022
icc t20 rankings 2022
author img

By

Published : Sep 26, 2022, 1:49 PM IST

ICC T20 Rankings 2022 : ఆస్ట్రేలియాతో సిరీస్​ గెలిచి ఉత్సాహం మీద ఉంది టీమ్​ ఇండియా. తాజాగా మరో వార్త భారత జట్టును, టీమ్ ఇండియా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్​లో మొదటి స్థానంలో నిలిచింది టీమ్​ ఇండియా.
హైదరాబాద్​ వేదికాగా భారత్​-ఆసీస్ సిరీస్ జరిగిన ఆఖరి మ్యాచ్​లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. నాగ్​పుర్​ ఓటమికి ప్రతీకారంగా తర్వాతి రెండు మ్యాచ్​లు గెలిచి సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

దీంతో టీమ్ ఇండియా 268 పాయింట్లకు చేరింది. తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్​ నిలిచింది. వరల్డ్​ కప్​ రానున్న తరుణంలో సౌత్​ ఆఫ్రికాతో సెప్టెంబర్​ 28 నుంచి జరగనున్న సిరీస్​లో ఇలాంటి ప్రదర్శన చేసి ర్యాంకింగ్​ లీడ్​ను కొసాగించే అవకాశం టీమ్​ ఇండియాకు ఉంది. ఆదివారం పాకిస్థాన్-ఇంగ్లాడ్ మధ్య జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాడ్​ ఓడిపోవడం.. ఇండియా ర్యాంకింగ్ మెరుగు పడటానికి కలిసొచ్చింది.

ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్​ పాయింట్ల వారీగా:

దేశం మ్యాచ్​లుపాయింట్లు రేటింగ్​
భారత్52 13,939 268
ఇంగ్లాండ్38 9,936 261
సౌత్​ ఆఫ్రికా34 8,787 258
పాకిస్థాన్40 10,328 258
న్యూజిలాండ్ 38 9,594 252
ఆస్ట్రేలియా 39 9,761 250

ఇవీ చదవండి: వైట్​బాల్ క్రికెట్​లో కోహ్లీ రికార్డు.. టీ20ల్లో ఈ ఏడాది ఛాంపియన్ అతడే..

'మీరు చేస్తే ఒప్పు.. మేము చేస్తే తప్పా'.. ఏది క్రీడా స్ఫూర్తి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.