ETV Bharat / sports

Corona Effect: బుడగలో.. 104 రోజులు - virat kohli

డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లీష్ జట్టుతో టెస్టు సిరీస్ కోసం గురువారం ఇంగ్లాండ్​లో అడుగుపెట్టింది టీమ్ఇండియా. అయితే ఈ పర్యటన ఏకంగా 104 రోజుల పాటు జరగనుంది. విదేశాల్లో భారత జట్టు ఈ మధ్యకాలంలో ఇన్నిరోజులు సుదీర్ఘ పర్యటన చేయడం ఇదే తొలిసారి.

team india
టీమ్ఇండియా
author img

By

Published : Jun 7, 2021, 8:10 AM IST

సుదీర్ఘమైన విదేశీ పర్యటన కోసం ఇంగ్లాండ్‌లో గురువారం అడుగుపెట్టిన టీమ్‌ఇండియా ఏకంగా 104 రోజుల తర్వాతే తిరిగి స్వదేశం చేరనుంది. చాలా కాలం తర్వాత జట్టు ఓ విదేశీ పర్యటన కోసం ఇంత ఎక్కువ కాలం వెచ్చించనుంది. ప్రస్తుత వ్యవధి చూస్తుంటే 1959లో ఇంగ్లాండ్‌లో భారత పర్యటన గుర్తుకు వస్తోంది. అప్పుడు నాలుగున్నర నెలల పాటు టీమ్‌ఇండియా అక్కడే గడిపింది. 136 రోజుల పాటు సాగిన ఆ పర్యటనలో దత్తాజీరావు సారథ్యంలోని భారత జట్టు ఐదు టెస్టులు, 28 ప్రాక్టీస్‌ (టూర్‌) మ్యాచ్‌లు ఆడింది. అప్పట్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కానీ ఇప్పుడు జట్లు.. విదేశాల్లో ఎక్కువగా అంతర్జాతీయ మ్యాచ్‌లే ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ఇన్ని రోజుల పాటు ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి రావడానికి ముఖ్య కారణం కరోనా మహమ్మారే!

ఇదీ షెడ్యూల్‌..

మొట్టమొదటి డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో పోరు, ఆ తర్వాత రూట్‌ సేనతో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం ఈ నెల 3న టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ చేరుకుంది. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో 10 రోజుల క్వారంటైన్‌లో ఉంది. తొలి మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ తర్వాత.. మైదానంలో సాధన చేసుకునేందుకు జట్టుకు వీలుంది. కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఈ నెల 18 నుంచి 22 వరకు జరగుతుంది. 23వ తేదీని రిజర్వ్‌ డేగా కేటాయించారు. ఆ తర్వాత 42 రోజుల విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌కు తెరలేవనుంది. ఆగస్టు 4న నాటింగ్‌హమ్‌లో తొలి టెస్టు మొదలు కానుంది. అయితే ఆ టెస్టుకు ముందు కొన్ని వార్మప్‌ మ్యాచ్‌లూ జరగనున్నాయి. చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్‌ 14న ముగుస్తుంది. దీంతో 104 రోజుల పర్యటనకు శుభం కార్డు పడుతుంది.

ఆ ఫైనల్‌ తర్వాత వద్దామంటే..

కివీస్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆరంభమయ్యే ముందు 42 రోజుల విరామం ఉంది. ఈ మధ్యలో టీమ్‌ఇండియా తిరిగి స్వదేశానికి వచ్చి.. మళ్లీ ఇంగ్లాండ్‌కు వెళ్లొచ్చు కదా? అలా ఎందుకు చేయడం లేదనే సందేహం రావడం సహజం. అయితే కష్టమైనా సరే అన్ని రోజుల పాటు ఇంగ్లాండ్‌లో ఉండాల్సి రావడానికి కారణం కరోనా పరిస్థితులే. ప్రస్తుతం మన దేశంలో రెండో దశ వైరస్‌ ఉద్ధృతి కారణంగా యూకే ప్రభుత్వం భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. బ్రిటన్‌ లేదా ఐర్లాండ్‌ ప్రజలను, యూకేలో నివసించే హక్కు ఉన్న వాళ్లను మాత్రమే అక్కడ అనుమతిస్తున్నారు. పైగా అక్కడికి చేరుకున్న తర్వాత తప్పనిసరిగా 10 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి. క్రికెట్‌ సిరీస్‌ కోసమని టీమ్‌ఇండియాకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక అనుమతినిచ్చింది. ఈ పరిస్థితుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ తర్వాతి తిరిగి స్వదేశం వచ్చి.. మళ్లీ ఇంగ్లాండ్‌తో సిరీస్‌ కోసం అక్కడికి వెళ్లడమంటే క్లిష్టమైన పనే. జట్టు మళ్లీ పది రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుంది. మరోవైపు బయో బబుల్‌ వాతావరణంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు సార్లు బుడగను ఏర్పాటు చేయడం శ్రమతో కూడుకున్నది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని.. సుదీర్ఘమైనా పర్వాలేదని ఈ షెడ్యూల్‌ రూపొందించారు.

ఇవీ చూడండి: Gavaskar:​ 'అందుకే కోచ్​గా చేయలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.