ETV Bharat / sports

Team India Quarantine: మూడు రోజుల క్వారంటైన్​లో టీమ్ఇండియా - కరోనా

Team India Quarantine: భారత జట్టు డిసెంబర్ 16న దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అందుకోసం ముందే మూడు రోజుల పాటు క్వారంటైన్​లో ఉండనుంది. ఆ తర్వాతే జట్టు సభ్యులు విమానం ఎక్కనున్నారు.

team india quarantine
team india news
author img

By

Published : Dec 13, 2021, 4:12 PM IST

Updated : Dec 13, 2021, 4:45 PM IST

Team India Quarantine: ఈ వారంలోనే భారత్‌ జట్టు దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. అయితే కరోనా నిబంధనల కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు భారత జట్టు క్రీడాకారులు మూడు రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఇప్పటికే ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు ఆటగాళ్లు చేరుకున్నారు.

బయోబబుల్‌లో భాగంగా బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే సారథ్యంలో రోహిత్‌ శర్మ, అజింక్యా రహానె, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఈ గ్రూపు మూడు రోజులు క్వారంటైన్‌ పూర్తి చేసుకుని డిసెంబర్‌ 16న దక్షిణాఫ్రికాకు బయలుదేరుతుంది. ఈ సీనియర్‌ ఆటగాళ్ల గ్రూప్‌ అక్కడికి చేరుకున్న తర్వాతనే.. భారత జట్టులోని మిగతా ఆటగాళ్లు దక్షిణాఫ్రికాకు బయలుదేరుతారు.

తొలి టెస్టు డిసెంబర్‌ 26న సెంచూరియన్‌ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ జట్టుకు విరాట్‌ కోహ్లీనే సారథ్యం వహించనున్నాడు. ఆ తర్వాత జరిగే వన్డేలకు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు.

ఇదీ చూడండి: IND vs SA Series: టీమ్ఇండియా దక్షిణాఫ్రికా ప్రయాణం అప్పుడే!

Last Updated : Dec 13, 2021, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.