టీమ్ఇండియా పేసర్ సందీప్ శర్మ ఓ ఇంటివాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విన్ను మనువాడాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది.
-
A special addition to the #SRHFamily.😍
— SunRisers Hyderabad (@SunRisers) August 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to Mr and Mrs Sharma 🙌🏽
🥂 to a lifelong partnership!#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/gQcLsX9nIL
">A special addition to the #SRHFamily.😍
— SunRisers Hyderabad (@SunRisers) August 20, 2021
Congratulations to Mr and Mrs Sharma 🙌🏽
🥂 to a lifelong partnership!#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/gQcLsX9nILA special addition to the #SRHFamily.😍
— SunRisers Hyderabad (@SunRisers) August 20, 2021
Congratulations to Mr and Mrs Sharma 🙌🏽
🥂 to a lifelong partnership!#OrangeOrNothing #OrangeArmy pic.twitter.com/gQcLsX9nIL
సందీప్, తాషా పెళ్లి ఫొటోను షేర్ చేస్తూ.. "ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యామిలీలోకి ప్రత్యేకమైన వ్యక్తి చేరింది. మీ సుదీర్ఘ దాంపత్య జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం'' అంటూ ట్వీట్ చేసింది సన్‌రైజర్స్. దీనిపై అభిమానులు స్పందిస్తూ వారి జోడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా, తాషా సాత్విక్ జ్యువెలరీ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 2018లోనే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ అయినప్పటికీ.. కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.
సందీప్ శర్మ 2013 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 95 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన అతడు 7.8 ఎకానమీతో 110 వికెట్లు తీశాడు. 2017 వరకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడిన సందీప్ ఆ తర్వాత 2018 నుంచి సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.