ETV Bharat / sports

Team India ODI Ranking : నెం.1 రేసులో టీమ్ఇండియా.. మెగాటోర్నీ కంటే ముందే ఆ ప్లేస్​ దక్కేనా ?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 10:57 AM IST

Team India ODI Ranking : ఏడాదిన్నర కాలంగా వన్డే ర్యాంకింగ్స్​లో నెం.1 పోజిషన్​ను దక్కించుకోవడం టీమ్ఇండియాకు అందని ద్రాక్షలా మారింది. అయితే 2023 ప్రపంచ కప్​నకు ముందు భారత్.. ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. అదెలాగంటే?

Team India ODI Ranking
Team India ODI Ranking

Team India ODI Ranking : 2023 ప్రపంచ కప్ కోసం యావత్ క్రీడాలోకం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈ మెగాటోర్నీ మరో 20 రోజుల్లో ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టైటిల్ కోసం.. ప్రపంచంలోని మేటి క్రికెట్ జట్లు పోటీలో ఉండనున్నాయి. అయితే ఈ మెగాటోర్నీ సమీపిస్తున్న తరుణంలో టీమ్ఇండియా ఓ అరుదైన ఘనతను అందుకునే ఛాన్స్ ఉంది. అదేంటంటే..

ప్రస్తుతం ఐసీసీ వన్డే టీమ్స్​ ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా (118 పాయింట్లు), పాకిస్థాన్ (118 పాయింట్లు) జట్లు టాప్​లో ఉన్నాయి. వీటి తర్వాత స్వల్ప తేడాతో టీమ్ఇండియా (116 పాయింట్లు) మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే 2023 ప్రపంచకప్​ కంటే ముందు ఆగ్ర స్థానానికి చేరేందుకు భారత్​కు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

2023 వరల్డ్ కప్​ కంటే ముందు టీమ్ఇండియా.. మరో ఐదు వన్డే మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. అందులో రెండు ప్రస్తుత ఆసియా కప్​లో, మరో మూడు మ్యాచ్​లు ఆస్ట్రేలియాతో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్​లో ఆడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా ఆసియా కప్ టైటిల్, ఆసిస్​తో వన్డే సిరీస్ గెలిస్తే.. ర్యాంకింగ్ మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో రానున్న మ్యాచ్​ల్లో ఎలాగైనా గెలిచి.. ప్రపంచ నెం.1 జట్టు హోదాలో టీమ్ఇండియా.. వరల్డ్​ కప్​నకు ఆతిథ్యం ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే టీమ్ఇండియా చివరిసారిగా.. 2022 మార్చ్​లో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది.

ఇక టాప్​లో ఉన్న ఆసిస్, పాక్ జట్లకూ.. తమ ర్యాంక్​ను పదిలం చేసుకునేందుకు అవకాశాలున్నాయి. 2023 ఆసియా కప్​ సూపర్ 4లో గురువారం పాక్.. శ్రీలంకను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్​తో పాటు, ఫైనల్లోనూ పాక్ గెలిస్తే.. తమ టాప్ పొజిషన్​కు ఎలాంటి ముప్పు ఉండదు. కానీ ఫైనల్​లో భారత్ గెలిస్తే మాత్రం పాకిస్థాన్ టాప్ ప్లేస్​కు గండి పడుతుంది.

మరోవైపు సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న ఆసిస్.. ఆతిథ్య జట్టుతో 5 మ్యాచ్​ల వన్డే సిరీస్​ ఆడుతోంది. తొలి రెండు మ్యాచ్​ల్లో ఆసిస్ నెగ్గగా.. మూడో వన్డేలో సౌతాఫ్రికా గెలిచింది. తర్వాతి రెండు మ్యాచ్​ల్లో కూడా ఆసిస్ ఓడితే.. అగ్ర స్థానం నుంచి మూడో ప్లేస్​కు పడిపోతుంది. భారత్​తో జరిగే 3 మ్యాచ్​ల వన్డే సిరీస్​లో నెగ్గితే ఆసిస్ మళ్లీ టాప్​లోకి వెళ్తుంది.

Here's the #TeamIndia squad for the ICC Men's Cricket World Cup 2023 🙌#CWC23 pic.twitter.com/EX7Njg2Tcv

— BCCI (@BCCI) September 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 IND VS PAK : అదే జరిగితే మూడోసారి భారత్-పాక్ మ్యాచ్ కన్ఫార్మ్! సమీకరణాలు ఎలా ఉన్నాయంటే?

ICC ODI Ranking Team 2023 : వన్డే ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా​ టాప్.. భారత్ ప్లేస్ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.