Team India New Adidas Jersey : టీమ్ఇండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇటీవలే బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ 'అడిడాస్'.. కొత్త జెర్సీలను విడుదల చేసింది. ముంబయిలోని వాంఖడే స్డేడియంలో భారత క్రికెట్ జట్టు మూడు ఫార్మాట్లకు చెందిన జెర్సీలను ఆవిష్కరించింది. దీంతో పాటు అధికార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "ఒక ఐకానిక్ క్షణం. ఒక ఐకానిక్ స్టేడియం. కొత్త టీమ్ ఇండియా జెర్సీలను పరిచయం చేస్తున్నాము" అంటూ రాసుకొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
Team India Adidas Deal : టీమ్ఇండియా కొత్త కిట్ స్పాన్సర్‌గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ బ్రాండ్ 'అడిడాస్'తో బీసీసీఐ గత నెలలో ఒప్పందం కుదుర్చుకుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఈ ఒప్పందం జూన్ 1 నుంచి అమలులోకి రానుందని అప్పుడే ప్రకటించారు. ఒప్పంద ప్రక్రియ.. అడిడాస్‌తో ఒప్పందం 2028 వరకు అడిడాస్.. టీమ్ఇండియాతో కొనసాగనునుంది. ఈ అగ్రిమెంట్లో భాగంగా స్పాన్సర్‌గా ఉండనున్న అడిడాస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.65 లక్షలు దాకా బీసీసీఐకు చెల్లించనుంది. ఈ లెక్కన ప్రతి ఏడాది అన్ని ఫార్మాట్లలో మ్యాచ్‌లు కలుపుకొని సుమారు రూ.70 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. జూన్ 7-11 తేదీల్లో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ నుంచే అడిడాస్ స్పాన్సర్షిప్ అమలుకానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం.. అడిడాస్ జెర్సీలను విడుదల చేసింది.
WTC Final 2023 : జూన్ 7-11 తేదీల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఐపీఎల్ ముగించుకున్న టీమ్ఇండియా ఆటగాళ్లంతా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుని.. ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. కాగా మొదటి డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలన్న కసితో బరిలో దిగనుంది.
రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా జట్టు:
WTC Final 2023 Squad : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, షమి, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్.
-
Unveiling #TeamIndia's new training kit 💙💙
— BCCI (@BCCI) May 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Also, kickstarting our preparations for the #WTCFinal pic.twitter.com/iULctV8zL6
">Unveiling #TeamIndia's new training kit 💙💙
— BCCI (@BCCI) May 25, 2023
Also, kickstarting our preparations for the #WTCFinal pic.twitter.com/iULctV8zL6Unveiling #TeamIndia's new training kit 💙💙
— BCCI (@BCCI) May 25, 2023
Also, kickstarting our preparations for the #WTCFinal pic.twitter.com/iULctV8zL6
ఆస్ట్రేలియా జట్టు:
ప్యాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హరీస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, నేథన్ లియాన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మ్యాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.