టీ20 ఫార్మాట్‌ను మరిపించేలా చెలరేగి పోయారు టీమ్ ఇండియా బ్యాటర్లు. ప్రతి బంతికి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌండరీల మీద బౌండరీలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో శ్రీలంక బౌలర్లను పడేశారు భారత బ్యాటర్లు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అటు బ్యాటింగ్‌తో.. ఇటు బౌలింగ్‌తో లంక జట్టును అష్టదిగ్బంధనం చేశారు. ఊపిరి సలపని స్థితిలో శ్రీలంక టీమ్ చేతులెత్తేసింది. శ్రీలంక మొదటి నుంచి భారత బౌలర్ల ధాటికి చతికిలపడిపోయింది. 22 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా వాండర్సే బ్యాంటింగ్‌కు దిగలేదు. భారత్ నిర్దేశించిన 391 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమ్ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్ (4), షమీ (2), కుల్దీప్ యాదవ్ (2) వికెట్లు తీశారు.
మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక బౌలర్లకు చుక్కలు చూపించారు టీమ్ఇండియా బ్యాటర్లు. విరాట్ కోహ్లీ పంజా విసిరాడు. 110 బంతుల్లో చెలరేగి ఆడి 166 పరుగుల చేశాడు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 116 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (49), శ్రేయస్ అయ్యర్(38) రాణించారు. కేఎల్ రాహుల్ (7) పరుగులకే పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్(5), అక్షర్ పటేల్(2) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార (2) వికెట్లు తీయగా.. కసున్ రజిత(2), చమిక కరుణరత్నే (1) వికెట్ పడగొట్టారు.