Team India Gabba Test Win: టీమ్ఇండియా సరిగ్గా మూడేళ్ల కిందట చారిత్రక విజయం సాధించింది. 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్, గబ్బా మైదానంలో 3 దశాబ్దాలకుపైగా తిరుగులేని ఆసీస్‌కు ఓటమి రుచి చూపించింది. టెస్టు సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్ అజింక్య రహానే గిల్, మయంక్ అగర్వాల్, రిషభ్ పంత్, సుందర్ వంటి కుర్రాళ్లతో నిండిన టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో టీమ్ఇండియా కైవసం చేసుకుంది.
అయితే గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాను ఓడించడం అంత సులువేమీ కాదన క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. అక్కడి ఫ్లాట్ పిచ్‌లపై పేసర్లు సంధించే బౌన్సర్లను ఎదుర్కొవడం కూడా బ్యాటర్లకు సవాలే. అప్పటివరకు ఆసీస్ గబ్బా గ్రౌండ్లో 1988లో వెస్టిండీస్‌తో ఓటమి పాలైంది. ఆ తర్వాత దాదాపు 3 దశాబ్దాలకు పైగా గబ్బాలో ఆసీస్‌కు ఓటమి లేదు. అయితే అదే గ్రౌండ్లో 2021 జనవరి 19న టీమ్ఇండియా, ప్రత్యర్థిని ఓడించడంతో యువ భారత్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.
-
🗓️ #OnThisDay in 2021 #TeamIndia secured a monumental victory at the Gabba to seal the Test series against Australia 2-1 🏆🇮🇳 pic.twitter.com/nqGRYzmmmv
— BCCI (@BCCI) January 19, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">🗓️ #OnThisDay in 2021 #TeamIndia secured a monumental victory at the Gabba to seal the Test series against Australia 2-1 🏆🇮🇳 pic.twitter.com/nqGRYzmmmv
— BCCI (@BCCI) January 19, 2024🗓️ #OnThisDay in 2021 #TeamIndia secured a monumental victory at the Gabba to seal the Test series against Australia 2-1 🏆🇮🇳 pic.twitter.com/nqGRYzmmmv
— BCCI (@BCCI) January 19, 2024
-
On this day in 2021.
— 𝗠𝗼𝗵𝗶𝘁. (@Mohit_Viratfan) January 19, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
India breached the Gabba fortress and won the test series.pic.twitter.com/NjjYoQVT3V
">On this day in 2021.
— 𝗠𝗼𝗵𝗶𝘁. (@Mohit_Viratfan) January 19, 2024
India breached the Gabba fortress and won the test series.pic.twitter.com/NjjYoQVT3VOn this day in 2021.
— 𝗠𝗼𝗵𝗶𝘁. (@Mohit_Viratfan) January 19, 2024
India breached the Gabba fortress and won the test series.pic.twitter.com/NjjYoQVT3V
మ్యాచ్ విషయానికొస్తే రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (91 పరుగులు), ఛెతేశ్వర్ పుజారా (56 పరుగులు), రిషభ్ పంత్ (89* పరుగులు) కీలక ఇన్నింగ్స్‌తో రాణించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (22) ఆకట్టుకున్నాడు.
రిషభ్ భేష్: ఈ మ్యాచ్ ఛేజింగ్‌లో రిషభ్ పంత్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. వికెట్లు పడుతున్నా, ఒత్తిడిని తట్టుకొని పంత్ బలంగా నిలబడ్డాడు. ఆఖరి రోజు మ్యాచ్‌ను డ్రా గా ముగించినా ఫర్వాలేదనుకున్న టీమ్ఇండియాకు చిరస్మరణీయ విజయం అందించడంలో పంత్ కీలకంగా వ్యవహరించాడు. అటు బౌలింగ్‌లో పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 5 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు' లభించగా, ఆస్ట్రేలియా ప్లేయర్ ప్యాట్ కమిన్స్ (21 వికెట్లు) 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గా నిలిచాడు