ETV Bharat / sports

MS Dhoni: అత్యుత్తమ సారథి.. రికార్డులకు 'వారధి' ధోనీ - dhoni retirement

భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వేసిన మహేంద్రసింగ్​ ధోనీ(MS Dhoni).. తన కెరీర్​లో ఎన్నో రికార్డులు అందుకున్నాడు. విజయవంతమైన కెప్టెన్​గా నిలిచాడు. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్​లు, వన్డేల్లో సారథి​గా 100కుపైగా విజయాలు, 200 సిక్స్​లు కొట్టిన తొలి భారత బ్యాట్స్​మన్​గా నిలవడమే కాకుండా మరెన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్నాడు. నేడు (జులై 7) ధోనీ పుట్టినరోజు(Dhoni Birthday) సందర్భంగా అతని జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Team India Former Captain MS Dhoni Birthday Special Story
MS Dhoni: అత్యుత్తమ కెప్టెన్​.. రికార్డుల సారథి ధోనీ
author img

By

Published : Jul 7, 2021, 6:14 AM IST

16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్​గా అసాధ్యాలను సుసాధ్యం చేశాడు టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni). ఈ క్రమంలోనే అతడి ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. ఐసీసీ టోర్నీలు అన్నింటిలో విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఈతరం క్రికెటర్లకు ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. నేడు (జులై 7) ధోనీ పుట్టినరోజు(Dhoni Birthday) సందర్భంగా అతని జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Team India Former Captain MS Dhoni Birthday Special Story
ధోనీ బర్త్​డే కామన్​ డీపీ

వ్యక్తిగతం

మహేంద్రసింగ్ ధోనీ.. 1981 జులై 7న ఉమ్మడి బిహార్​ రాష్ట్రంలోని రాంచీలో జన్మించాడు. టీమ్​ఇండియాలో వికెట్​ కీపర్​, మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​గా అడుగుపెట్టిన ధోనీ.. అనతి కాలంలోనే జట్టులో కీలకపాత్ర పోషించాడు. 2004లో బంగ్లాదేశ్​తో జరిగిన వన్డే ద్వారా క్రికెట్​లో అరంగేట్రం(Dhoni Entry in Cricket) చేసి.. ఆ తర్వాతి సంవత్సరం శ్రీలంకతో జరిగిన టెస్టుతో అపరిమిత ఓవర్ల ఫార్మాట్​లో అడుగుపెట్టాడు. 2010లో సాక్షిని వివాహమాడాడు.

టీమ్ఇండియా మాజీ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ పుట్టినరోజు

ఆపద్భాంధవుడు ధోనీ..

బ్యాటింగ్ చేయగల వికెట్‌ కీపర్ దొరక్క రాహుల్ ద్రవిడ్‌పై అదనపు భారం మోపి లాక్కొస్తున్న రోజులవి. పార్థివ్ పటేల్‌, అజయ్ ‌రాత్రాల లాంటి వచ్చివెళ్లే వాళ్లు తప్ప స్థిరత్వం ఉన్న కీపర్ బ్యాట్స్‌మన్‌ దొరకడం లేదు. అలాంటి సమయంలో 2004లో టీమ్ఇండియా తలుపు తట్టాడు ధోనీ. కొద్దిరోజుల్లోనే నమ్మదగ్గ కీపర్‌గా, భరోసా ఉంచదగిన బ్యాట్స్‌మన్‌గా మారిపోయాడు. జట్టులోకి వచ్చిన మూడేళ్లలోపే సారథిగా మారి, దశాబ్దం పాటు ముందుండి నడిపించాడు.

ఎం.ఎస్​.ధోనీ

వన్డేల్లో అత్యధిక స్టంపింగ్​లు..

2004 డిసెంబర్ 23న తొలి వన్డే ఆడాడు ధోనీ. మొత్తం కెరీర్‌లో 350 వన్డేల్లో దాదాపు 51 సగటుతో 10,773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 6 ఓవర్లు బౌలింగ్‌ చేసి, ఒక వికెట్ కూడా తీశాడు. ఈ ఫార్మాట్​లో 321 క్యాచ్‌లు పట్టి, 123 స్టంపింగ్‌లు చేశాడు. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా ఉండే ఈ కీపర్.. 444 వికెట్లలో భాగస్వామ్యం పంచుకున్నాడు. ఈ ఫార్మాట్​లో అత్యధిక స్టంపింగ్‌ల రికార్డు ధోనీ పేరిటే ఉంది.

ఎం.ఎస్​. ధోనీ

ఆ రికార్డు సాధించిన తొలి భారత కెప్టెన్

200 వన్డేలకు కెప్టెన్సీ వహించిన ధోనీ.. 110 విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా 100కు పైగా వన్డే మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించిన ఏకైక ఆస్ట్రేలియేతర సారథిగా చరిత్ర సృష్టించాడు. సచిన్ తర్వాత 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న 4వ భారతీయ క్రికెటర్‌, రెండో వికెట్‌ కీపర్‌గా నిలిచాడు.

ఛాంపియన్స్​ ట్రోఫీతో ఎం.ఎస్​. ధోనీ

ఏకైక బ్యాట్స్​మన్ మహీనే

మొత్తం వన్డే కెరీర్‌లో 50 సగటుతో 10 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ధోనీ. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 4,031 పరుగులు చేశాడు. ఏడులో దిగి సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్​గా రికార్డు సృష్టించాడు. ఈ స్థానంలోనే రెండు శతకాలు చేశాడు. వన్డేల్లో 82 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఫార్మాట్​లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు.

అదే అత్యుత్తమ భాగస్వామ్యం

2005లో శ్రీలంకపై ధోనీ చేసిన 183 పరుగులు ఓ వికెట్ కీపర్‌కు అత్యధిక పరుగులు. అదే జట్టుపై ధోనీ- భువనేశ్వర్.. 8వ వికెట్‌కు నెలకొల్పిన 100 పరుగుల భాగస్వామ్యమే ఆ వికెట్‌కు భారత్‌ తరఫున అత్యధికం.

వికెట్ కీపర్.. 200 వన్డేలకు సారథ్యం

ఓ వికెట్‌ కీపర్ దాదాపు 200 మ్యాచ్‌లకు సారథ్యం(Dhoni as Captain) వహించిన రికార్డు ధోనీదే. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లలో భాగస్వామ్యంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. మహీ కెప్టెన్సీలోనే భారత్.. 2011 వన్డే ప్రపంచ విజేతగా నిలిచింది. 2015 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది.

టెస్టు ట్రోఫీతో ధోనీ

సొంతగడ్డపై ఎక్కువ.. విదేశాల్లో తక్కువ

2005 డిసెంబర్‌ 2న టెస్టు అరంగేట్రం చేశాడు ధోనీ. తన పదేళ్ల కెరీర్‌లో 90 టెస్టులు ఆడాడు. 4 వేల 876 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్​లో అతడి అత్యధిక స్కోరు 224. 60 టెస్టుల్లో కెప్టెన్​గా 27 విజయాలు అందించాడు. 15 మ్యాచ్‌లు డ్రాగా ముగిస్తే, 18 మ్యాచ్​ల్లో భారత్‌ ఓడింది.

2009లో ధోనీ ఉన్నప్పుడే భారత్.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్రస్థానం సంపాదించింది. సొంతగడ్డపై ఎక్కువ విజయాలు అందుకున్నాడు. విదేశాల్లో మాత్రం అత్యధిక పరాజయాలు మూటగట్టుకున్న టీమ్ఇండియా సారథిగా నిలిచాడు. టెస్టుల్లో 4వేల పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధోనీనే. ఈ ఫార్మాట్​లో 38 స్టంపింగులు చేశాడు మహీ. టెస్టుల్లో ఇదే అత్యధికం.

ధోనీ, సాక్షి

బయోపిక్​

'ధోని: అన్​టోల్డ్​ స్టోరీ'(M.S. Dhoni: The Untold Story) పేరుతో ధోని బయోపిక్​(Dhoni Biopic) తెరకెక్కింది. బాలీవుడ్​ దర్శకుడు నీరజ్​ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. 2016 సెప్టెంబరు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో ధోనీ పాత్రలో హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ నటించగా.. అతని భార్య సాక్షి పాత్రను నటి కియారా అడ్వాణీ పోషించింది. ధోనీని మరిపించే విధంగా అతని స్టైల్​ నుంచి ఆడే ఆటతీరు వరకు అచ్చం మహీలా తెరపై మెప్పించడంలో సుశాంత్​ నూటికి నూరు శాతం విజయం సాధించాడు.

ఎం.ఎస్​.ధోనీ బయోపిక్

వికెట్​ కీపింగ్​లో ధోనీ ఓ నమూనా

2006లో తొలి అంతర్జాతీయ టీ20 ఆడాడు ధోని. మొత్తంగా 98 టీ20ల్లో 1,617 పరుగులు చేశాడు. 73 మ్యాచ్​లకు కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తించాడు. అందులో 41 విజయాలు, 28 అపజయాలు ఉన్నాయి.

అయితే వికెట్ కీపింగ్‌లో ధోనీ.. క్రికెట్‌ ప్రపంచానికి ఓ నమూనాగా నిలిచాడని ఇంగ్లండ్ క్రికెటర్లు బట్లర్‌, స్టోక్స్ చెప్పడం అతడి ప్రతిభకు నిదర్శనం. ఆరు టీ20 ప్రపంచకప్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన మహీ.. 2007లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు.

ప్రస్తుతం

2019 ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​ ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్​. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. గతేడాది ఐపీఎల్​ ప్రారంభానికి ముందు ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు(Dhoni Retirement) పలుకుతున్నట్లు ధోనీ ప్రకటించాడు. ఈ ఏడాది జరగనున్న రెండో దశ ఐపీఎల్​ తర్వాత క్రికెట్​ నుంచి పూర్తిగా ధోనీ తప్పుకోనున్నాడని సమాచారం. అయితే ధోనీ ఐపీఎల్​లో కొనసాగుతాడా? లేదా క్రికెట్​ ప్రపంచానికి దూరంగా వెళ్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి.. Dhoni: భార్యకు ధోనీ స్పెషల్​ గిఫ్ట్​.. ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.