Surya Kumar Yadav: టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉత్తమమైన ఫామ్‌తో కొనసాగుతున్నారు. బంగ్లాపై విజయంలో ఈ ఆటగాళ్లు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 360 డిగ్రీల ఆటగాడు.. తన ఆట గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తానెప్పుడూ బౌలర్‌తో ఆడనని బంతితోనే ఆడతానని అన్నాడు.
"నా దృష్టి ఎప్పుడూ జట్టును గెలిపించే ప్రదర్శనపైనే ఉంటుంది. నేను బౌలర్‌తో గేమ్ ఆడను. బంతితో ఆటాడుకోవడానికే ఇష్టపడతాను. అదే సమయంలో ఏ బౌలర్‌కు ఎలాంటి షాట్లు ఆడాలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే గుర్తుంచుకుంటాను" అని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం విరాట్, సూర్యలు నెట్టింట తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ పోస్ట్ చేసిన ఫొటోకు తాజాగా సూర్యకుమార్ స్పందిస్తూ 'అగ్గి రాజేశావ్' అంటూ కామెంట్ చేశాడు. దానికి కోహ్లీ.. "సోదరా నువ్వే నంబర్ వన్" అంటూ మరో రిప్లై ఇచ్చాడు. వీరి సరదా సంభాషణను చూసిన నెటిజన్లు మీ ఇద్దరి దోస్తీ ఇలాగే కొనసాగాలంటూ కామెంట్లు పెడుతున్నారు.