ETV Bharat / sports

'అందుకే నంబర్​ వన్​ స్థానంలో టీమ్​ఇండియా' - రవి శాస్త్రి

టెస్టుల్లో టీమ్​ఇండియా నంబర్​ వన్​ ర్యాంకుపై హర్షం వ్యక్తం చేశాడు కోచ్ రవిశాస్త్రి. భారత క్రికెటర్ల స్థిరమైన ప్రదర్శన వల్లే తిరిగి అగ్రస్థానంలో నిలువగలిగామని తెలిపాడు.

ravi shastri, team india coach
రవి శాస్త్రి, టీమ్​ఇండియా ప్రధాన కోచ్
author img

By

Published : May 14, 2021, 11:32 AM IST

టెస్టుల్లో టీమ్​ఇండియా నంబర్ వన్​ ర్యాంక్​ కైవసం చేసుకోవడంపై కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. భారత కుర్రాళ్లపై ప్రశంసలు కురిపించాడు. వారి అసమాన పోరాటం వల్లే ఇది సాధ్యమైందని తెలిపాడు.

"టీమ్ఇండియా ధృడమైన సంకల్పం, స్థిరమైన ప్రదర్శన వల్లే సుదీర్ఘ ఫార్మాట్​లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగాం. ర్యాంకింగ్స్​కు సంబంధించి నిబంధనలను ఐసీసీ మధ్యలో మార్చింది. అయినప్పటికీ.. సవాళ్లను అధిగమిస్తూ తిరిగి నంబర్​ వన్​ ర్యాంకును పొందారు. కఠిన పరిస్థితుల్లో కఠిన క్రికెట్​ ఆడారు. జట్టు విజయాల పట్ల గర్వంగా ఉంది."

-రవిశాస్త్రి, టీమ్​ఇండియా ప్రధాన కోచ్.

గురువారం వార్షిక టెస్టు ర్యాంకింగ్​లను ఐసీసీ ప్రకటించింది. 121 పాయింట్లతో టీమ్​ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. కేవలం ఒక్క పాయింట్​ తేడాతో కివీస్​ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో 2-1, ఇంగ్లాండ్​తో 3-1 తేడాతో సాధించిన సిరీస్ విజయాలు ఇండియాకు కలిసొచ్చాయి.

ఇదీ చదవండి: ఈ క్రికెటర్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.