టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా కీలక మ్యాచ్‌లో ఆడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ సెమీస్ అవకాశాలను మరింత పదిలం చేసుకుంటే.. ఓడిన జట్టుకు ఛాన్స్‌లు సంక్లిష్టం అవుతుంది. అయితే ఈ కీలక పోరుకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావారణ శాఖ ఇటీవలే తెలిపింది. దీంతో ఈ మ్యాచ్ ఎక్కడ రద్దు అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు ఆడిలైడ్ నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. బుధవారం(నవంబర్ 2) ఉదయం నుంచి ఆడిలైడ్‌లో వర్షం పడట్లేదని తెలిసింది. అదే విధంగా నిన్నటి కంటే(నవంబరు 1) ఈ రోజు వాతావరణం మారినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్ బోరియా మజుందార్ ట్విటర్‌లో వెల్లడించారు. "గత కొన్ని గంటల నుంచి ఇక్కడ పూర్తిగా వర్షం పడడంలేదు. అదృష్టవశాత్తూ భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం ఆటంకం కలిగించే ఛాన్స్ లేదు" అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
-
9am Adelaide. No rain for some hours now. Overcast yes but no rain. @RevSportz pic.twitter.com/W0zWcES5dB
— Boria Majumdar (@BoriaMajumdar) November 1, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">9am Adelaide. No rain for some hours now. Overcast yes but no rain. @RevSportz pic.twitter.com/W0zWcES5dB
— Boria Majumdar (@BoriaMajumdar) November 1, 20229am Adelaide. No rain for some hours now. Overcast yes but no rain. @RevSportz pic.twitter.com/W0zWcES5dB
— Boria Majumdar (@BoriaMajumdar) November 1, 2022
ఇదీ చూడండి: కేఎల్ రాహుల్‌కు కోహ్లి బ్యాటింగ్ పాఠాలు.. అతడే ఓపెన్ చేస్తాడన్న ద్రవిడ్