ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టుకు తిరుగులేని రికార్డున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ(t20 world cup 2021 final) న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా(AUS vs NZ Final) గెలుస్తుందన్నారు టీమ్‌ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.
"నాకౌట్ మ్యాచ్‌ల్లో ఘన చరిత్ర కలిగిన ఆస్ట్రేలియా జట్టే ఫేవరెట్‌గా ఉంది. కీలక మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఓడిన వాటికన్నా గెలిచిన సందర్భాలే ఎక్కువ. బరిలోకి దిగాక ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమకు అనుకూలంగా మార్చుకుంటారు కంగారూలు. ఆ జట్టు ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో కేవలం న్యూజిలాండ్‌పైనే కాకుండా అన్ని జట్లపైనా కంగారూల ఆధిపత్యం కొనసాగింది. ఈసారి కూడా అవకాశాల్ని సద్వినియోగం చేసుకొని తొలిసారి టీ20 ప్రపంచకప్ ముద్దాడతారు" అని గావస్కర్ వివరించారు.
ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మొత్తం 18 సార్లు తలపడగా అందులో 12 సార్లు కంగారూలే విజయం సాధించారు. అలాగే మొత్తం 31 నాకౌట్ మ్యాచ్‌ల్లో 20 విజయాలు సాధించి దాదాపు అన్ని జట్లపైనా ఆస్ట్రేలియా ఆధిపత్యం చలాయించింది. ఈ క్రమంలోనే ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా, రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్‌గా అవతరించింది.
న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్(t20 world cup 2021 final) ఫైనల్(AUS vs NZ Final) మ్యాచ్ ఆదివారం (నవంబర్ 14) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: AUS vs NZ Final: మ్యాచ్‌ను మలుపుతిప్పే సమర్థులు వీరు!