ETV Bharat / sports

INS VS PAK T20: హై ఓల్టేజీ మ్యాచ్​లో పైచేయి ఎవరిదో! - భారత్-పాకిస్థాన్ రోహిత్ శర్మ

దాయాది జట్లు భారత్-పాకిస్థాన్(ind vs pak t20 world cup)​ మ్యాచ్​కు అంతా సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్-2021(t20 world cup 2021)లో భాగంగా దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్​లో ఏ జట్టు బలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

IND vs PAK
భారత్
author img

By

Published : Oct 24, 2021, 5:31 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌లో చాలాకాలం తర్వాత దిగ్గజ జట్ల(ind vs pak t20 world cup) మధ్య పోరు జరగబోతోంది. టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021)లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాకిస్థాన్(ind vs pak t20 world cup) తమ తొలి లీగ్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలతో ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లకు తెరపడగా.. కొంతకాలం నుంచి అంతర్జాతీయ టోర్నీలలో మాత్రమే ఇరు జట్లు తలపడుతూ వస్తున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్‌(odi world cup 2019) తర్వాత ఇప్పటివరకూ రెండు జట్లు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఫలితంగా తాజాగా జరిగే మ్యాచ్‌పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అది ఎంతలా అంటే సినిమా థియేటర్ల నెట్‌వర్కింగ్‌ సంస్థలు ఏకంగా తమ థియేటర్లలో.. ఈ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు సంపాదించాయి.

సమతూకంగా భారత్

ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ తోపాటు కోహ్లీ(virat kohli news), ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌లతో బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. అవకాశం లభిస్తే సత్తాచాటేందుకు సూర్యకుమార్‌ యాదవ్‌ ఉవ్విళ్లూరుతున్నాడు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా తమదైన శైలిలో విజృంభిస్తే భారీ స్కోర్లు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని భారత జట్టు అంచనా వేస్తోంది. పొట్టి క్రికెట్‌లో ఒకరిద్దరు కీలక ఆటగాళ్ల రాణించినా ఛేదనలోనూ సత్తా చాటవచ్చని భావిస్తోంది. భువనేశ్వర్‌తోపాటు తుది జట్టులో చోటు దక్కితే అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌కు కూడా తమదైన రోజు చెప్పుకోదగ్గ పరుగులు సాధించే సత్తా ఉంది.

బౌలింగ్‌ విభాగంలోనూ

భారత్‌ జట్టు బౌలింగ్ విభాగమూ బలీయంగానే కనిపిస్తోంది. జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీలతో పేస్‌ విభాగం పటిష్టంగా ఉంది. నాలుగో ఫాస్ట్‌ బౌలర్‌కు అవకాశం ఇస్తే శార్దూల్‌ ఠాకూర్‌కు జట్టులో చోటు దక్కనుంది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతోపాటు మరో స్పిన్నర్‌ను తీసుకోవాల్సి వస్తే అనుభవం ఉన్న అశ్విన్‌ సిద్ధంగా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి, రాహుల్‌ చాహర్‌కు కూడా స్పిన్‌ మాయాజాలంతో ఆకట్టుకునే సత్తా ఉంది.

యూఏఈ పిచ్​లపై అనుభవం

కరోనా కారణంగా టీ20 ప్రపంచకప్‌ స్వదేశం నుంచి యూఏఈకి మారినప్పటికీ.. భారత్‌కు ఇటీవల ఐపీఎల్‌ మ్యాచ్‌ల బాగా కలిసి వచ్చాయి. అక్కడి పిచ్‌లపై మన బ్యాటర్లు, బౌలర్లు మంచి పట్టు సాధించారు. వార్మప్ మ్యాచ్‌లలో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాపై.. అలవోక విజయాలు సాధించడమే ఇందుకు ఉదాహరణ. కాగా.. 2007 ప్రపంచకప్‌ గెలవడంలో ముఖ్యపాత్ర పోషించిన మహేంద్రసింగ్‌ ధోనీ(dhoni mentor india) ప్రస్తుత సిరీస్‌లో జట్టుకు మెంటార్‌గా వ్యవహరించడం.. జట్టుకు అదనపు బలంగా మారింది. 2007 నుంచి పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలలో పాకిస్థాన్​పై విజయం సాధించిన జట్టుకు ధోనీనే సారథిగా ఉన్నాడు. వ్యూహరచనలో మేటిగా పేరున్న ధోనీ(dhoni mentor india).. అంతర్జాతీయ టోర్నీలలో తడపడుతున్న కోహ్లీకి అడుగడుగునా మార్గనిర్దేశం చేయనున్నాడు.

పట్టుదలతో పాకిస్థాన్​

భారత్‌ జట్టుతో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే పాకిస్థాన్(pakistan vs india)​లో ఎక్కడలేని హడావుడి, ఉత్కంఠ కనిపిస్తుంది. ప్రపంచకప్‌ టోర్నీలలో భారత్‌పై పరాజయ పరంపరను అడ్డుకోవాలని పాక్ ప్రజలతోపాటు ఆ దేశ జట్టు కూడా పరితపిస్తూ ఉంటాయి. భారత్‌తో మ్యాచ్‌ జరిగే ప్రతిసారీ.. అనేక రకాల ప్రకటనలు, మీమ్స్‌ వివిధ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌ జట్టును ఎదుర్కొనేందుకు పాక్‌ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ జట్టు కూడా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగానే కనిపిస్తోంది. ఓపెనింగ్‌ జోడీగా మహ్మద్‌ రిజ్వాన్‌, సారథి బాబర్‌ అజామ్‌(babar azam stats) శుభారంభాలను ఇస్తుండగా.. ఫకర్‌ జమాన్‌తోపాటు సీనియర్లు మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌.. తమ జట్టుకు తగిన భాగస్వామ్యాలు అందిస్తే భారీ స్కోర్‌ చేసే సత్తా ఉంది. ఆసిఫ్‌ అలీ, ఆల్‌రౌండర్ హసన్‌ అలీ బ్యాటింగ్‌లో రాణిస్తున్నారు.

బౌలింగ్​లోనూ ఘనమే

మొదటి నుంచీ బౌలింగ్‌ విభాగంలో బలీయంగా ఉంటూ వస్తున్న పాక్‌ జట్టు ఈసారి కూడ.. భారత్‌పై అదే అస్త్రాన్ని నమ్ముకుంది. ఫాస్ట్‌ బౌలర్లు ఇమాద్‌ వసీమ్‌, షాహిన్‌ అఫ్రిదీ, హారిస్‌ రవూఫ్‌ మెరుగైన ఆటతీరు కనబరుస్తుండగా హసన్‌ అలీ కూడా వికెట్ టేకర్‌గా గుర్తింపు పొందాడు. మహ్మద్‌ వసీమ్‌, షాదాబ్‌ ఖాన్‌తో స్పిన్‌ విభాగం కూడా మెరుగ్గానే ఉంది. తమ దేశంలో సిరీస్‌లకు విదేశాలు ముందుకురాని నేపథ్యంలో పాకిస్థాన్ కూడా ఇటీవల యూఏఈ వేదికగానే ఎక్కువ మ్యాచ్‌లు ఆడడం.. ఆ జట్టుకు కలిసివచ్చే అంశం. అక్కడి పిచ్‌లపై పాక్‌ ఆటగాళ్లకు మంది అనుభవం ఉంది. లెఫ్టామ్‌ స్మిన్నర్‌ ఇమాద్‌కు యూఏఈ పిచ్‌లపై గొప్ప రికార్డు ఉంది. ఈ సిరీస్‌లో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికాపై ఓటమిపాలైన పాక్‌ జట్టు వెస్టిండీస్‌పై విజయం సాధించింది.

ఇవీ చూడండి

పాక్​ జట్టు బలంగా ఉంది.. గొప్పగా ఆడాలి: కోహ్లీ

భారత్​పై గెలిస్తే పాక్ ఆటగాళ్లకు భారీ బోనస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.