ETV Bharat / sports

భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. ఆ సూపర్​ యాడ్​ వచ్చేసింది

టీ20 ప్రపంచకప్​లో(t20 world cup 2021) భాగంగా ఈ నెల 24న జరగనున్న భారత్​-పాకిస్థాన్​ జట్ల(pak india match 2021) మధ్య జరిగే మ్యాచ్​ కోసం క్రికెట్​ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాటోర్నీ ప్రసార హక్కుదారులు వినూత్నంగా ఓ యాడ్​ను రూపొందించారు. అది ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ind vs pak
భారత్, పాక్
author img

By

Published : Oct 15, 2021, 2:05 PM IST

క్రికెట్‌ ప్రేమికులకు(t20 world cup 2021 schedule) పసందైన వినోదం అందించిన ఐపీఎల్‌ సందడి ఈరోజుతో(అక్టోబర్​ 15) ముగియనుంది. ఇక 2021 టీ20 ప్రపంచకప్‌(T20 worldcup) ఈ నెల 17 నుంచి మొదలుకాబోతోంది. యూఏఈ, ఒమన్‌ వేదికలుగా ఈ మెగా ఈవెంట్‌ మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. అయితే, ఈనెల 24న భారత్‌xపాకిస్థాన్‌ జట్ల(india pakistan match t20 world cup ) మధ్య జరిగే మ్యాచ్ కోసమే ప్రపంచంలోని క్రికెట్‌ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరిసారి 2019 వన్డే ప్రపంచకప్‌లో పోటీ పడిన ఈ రెండు జట్లు మళ్లీ ఇన్నాళ్లకు బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇప్పుడిక క్రికెట్‌ ప్రేక్షకులను మరింత అలరించేందుకు టీ20 ప్రపంచకప్‌(T20 worldcup schedule) ప్రసార హక్కుదారులు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నేపథ్యంలో వినూత్నంగా ఓ అడ్వర్టయిజ్‌మెంట్‌ రూపొందించారు. అది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ భారత అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఆ యాడ్‌లో.. ఓ పాక్‌ అభిమాని దుబాయ్‌లోని ఓ ఎలక్ట్రానిక్‌ షాప్‌కి వెళ్లి త్వరలో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ మ్యాచ్‌లను చూసేందుకు కొత్త టీవీ కొనాలని అంటాడు. ఈసారి తమ పాకిస్థాన్‌ జట్టులో బాబర్‌ అజామ్, రిజ్వాన్‌ లాంటి ఆటగాళ్లు ఉన్నారని, దాంతో వారు భారత్‌ను ఓడిస్తారని చెబుతాడు. దీనికి స్పందించిన భారత షోరూమ్‌ యజమాని 'బయ్‌ వన్‌, బ్రేక్‌ వన్‌' అంటూ రెండు టీవీలు చూపిస్తాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో పాక్‌పై టీమ్‌ఇండియా సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఒకవేళ పాక్ ఓటమిపాలైతే ఒక టీవీని పగులగొట్టినా రెండో టీవీ ఉంటుందనే ఉద్దేశంలో అలా అంటాడు. దీనికి భారత అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

మరోవైపు, భారత్‌-పాకిస్థాన్‌ జట్లు(pak india match 2021 date) ఇప్పటివరకు వన్డే, టీ20 ప్రపంచకప్‌లలో మొత్తం 12 సార్లు తలపడ్డాయి. అందులో అన్నింటిలోనూ టీమ్‌ఇండియానే(india pakistan match t20 world cup 2021) విజేతగా నిలిచింది. దీంతో ఈసారి కూడా కోహ్లీసేన చిరకాల ప్రత్యర్థిపై విజయపరంపర కొనసాగిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.

ఇదీ చదవండి:

టీమ్​ఇండియాపై మేం గెలవడం పక్కా: బాబర్​ అజామ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.