ETV Bharat / sports

కోహ్లీ, ధోనీ క్రీడాస్ఫూర్తి.. భారత్‌ - పాక్‌ జట్లపై ఐసీసీ హర్షం

మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ క్రీడాస్ఫూర్తి పట్ల ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. అందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. 'ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి' అంటూ భారత్‌-పాక్‌ క్రికెట్‌ జట్లను(nd vs pak t20 world cup 2021) మెచ్చుకుంది.

Spirit of Cricket
కోహ్లీ, ధోనీ క్రీడాస్ఫూర్తి
author img

By

Published : Oct 26, 2021, 6:45 AM IST

Updated : Oct 26, 2021, 7:59 AM IST

క్రీడాస్ఫూర్తి.. ఇది ఏ ఆటలోనైనా క్రీడాకారులకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. అందుకు టీమ్‌ఇండియా, పాక్‌ ఆటగాళ్లు కూడా మినహాయింపు కాదు. ముఖ్యంగా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ క్రీడాస్ఫూర్తి చాటడంలో ముందుంటారు. ఆ విషయాన్ని తాజాగా మరోసారి నిరూపించారు. పాకిస్థాన్‌తో(T20 world cup 2021 updates) ఓటమిపాలయ్యాక విరాట్‌.. బాబర్‌ అజామ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ దగ్గరికెళ్లి హత్తుకొని మరీ నవ్వుతూ అభినందించాడు. ఈ సన్నివేశాలు ఇరు జట్ల అభిమానులను ఆకట్టుకున్నాయి.

Spirit of Cricket
పాక్​ ఆటగాళ్లతో మాట్లాడుతున్న ధోనీ

మరోవైపు మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆన్‌ఫీల్డ్‌ అయినా, ఆఫ్‌ ఫీల్డ్‌ అయినా తనదైన వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటాడు. సింపుల్‌గా ఉంటూ ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతాడు. ఈ క్రమంలోనే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌(T20 world cup 2021 updates) అనంతరం అతడు మైదానంలోనే పలువురు దాయాది జట్టు ఆటగాళ్లతో కలిసి ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆటకు సంబంధించిన కొన్ని విషయాలను వారితో సంతోషంగా పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. ఇది కదా నిజమైన క్రీడాస్ఫూర్తి అంటూ భారత్‌-పాక్‌ క్రికెట్‌ జట్లను(T20 world cup 2021 news) మెచ్చుకుంది. దాయాదుల పోరుపై బయట ఉండేటంత భావోద్వేగం, ఉద్రేకం లాంటివి రెండు జట్ల మధ్య ఉండవని అభిప్రాయపడింది. ఆ ఫొటోలు, వీడియో మీరూ చూసి ఆనందించండి.

ఇదీ చూడండి: IND VS PAK: పాక్ ఆటగాడికి కెప్టెన్ కోహ్లీ హగ్

Last Updated : Oct 26, 2021, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.