ETV Bharat / sports

2024 టీ20 వరల్డ్​ కప్​న​కు మేము ఆతిథ్యం ఇవ్వలేం : డొమినికా - టీ20 ప్రపంచకప్​కు ఆతిథ్యమివ్వనున్న విండీస్​ దేశాలు

T20 World Cup 2024 Dominica : ఐసీసీ టీ20 ప్రపంచకప్​ 2024కు ఆతిథ్యం ఇస్తుందనుకున్న కరేబియన్ దేశం డొమినికా.. తాజాగా ఆ బాధ్యతలను నిర్వర్తించలేమని చేతులెత్తేసింది. ఈ మేరకు ఆతిథ్య దేశాల జాబితా నుంచి తప్పుకుంది. కారణం ఏంటంటే?

Dominica Withdraw From Hosting ICC Mens T20 World Cup 2024
Dominica Says No To 2024 T20 Hosting
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 3:14 PM IST

Updated : Dec 1, 2023, 4:17 PM IST

T20 World Cup 2024 Dominica : నిర్ణీత సమయంలో స్టేడియం నిర్మాణ పనులను పూర్తి చేసే పరిస్థితి లేకపోవడం వల్ల వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో తమకు కేటాయించిన మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని డొమెనికా తేల్చి చెప్పింది. ప్రపంచకప్‌ కోసం వెస్టిండీస్‌ ఎంపిక చేసిన ఏడు వేదికల్లో డొమెనికా ఒకటి. ఇక్కడి విండ్సర్‌ పార్క్‌ మైదానంలో ఒక గ్రూప్‌, రెండు సూపర్‌-8 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. 'విండ్సర్‌ పార్క్‌ స్టేడియంలో అవసరమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిర్ణీత సమయానికి మైదానాన్ని మెరుగులు దిద్దే పని పూర్తి కాదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఈ టోర్నీలో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వకూడదని భావిస్తున్నాం' అని డొమెనికా ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఆతిథ్యం ఇవ్వడంలో డొమినికాకు ఉన్న ఖ్యాతి దృష్ట్యా తాజా నిర్ణయం అందరికీ మేలు చేస్తుందని డొమినికా పేర్కొంది. అయితే ఈ విషయంపై ఇంటర్నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్​ (ఐసీసీ) ఇంకా స్పందించలేదు.

  • The Commonwealth of Dominica has advised that they are no longer able to host matches in the ICC Men’s T20 World Cup 2024.

    Read More⬇️ https://t.co/b3XTk3inoJ

    — Windies Cricket (@windiescricket) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియం, బెంజమిన్స్ పార్క్‌లో ప్రాక్టీస్ సహా టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించాలని ముందుగా భావించాము. అయితే ప్రస్తుతం పనులు జరుగుతున్న వేగాన్ని పరిశీలిస్తే నిర్ణీత గడువులోగా వేదికలను సిద్ధం చేయడం సాధ్యం కాదు. ఇక్కడకు వచ్చేవారికి సరైన వసతులు కల్పించలేము. అవసరమైన చోట అదనపు పిచ్​లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ విషయంలోనూ జాప్యం జరిగే అవకాశం ఉంది. అందుకే ఆతిథ్యం ఇచ్చేందుకు సుముఖంగా లేము."

- డొమినికా ప్రభుత్వం

ICC T20 World Cup 2024 Host Country : ఇక 2024 టీ20 ప్రపంచకప్‌ను కరీబియన్‌లోని 7 దేశాలైన డొమినికా, ఆంటిగ్వా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలతో పాటు అమెరికా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా ఈ జాబితా నుంచి డొమినికా వైదొలగడం వల్ల టీ20 టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న కరీబియన్​ దేశాల సంఖ్య 6కు చేరింది.

ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేశాక విండీస్‌ వికెట్‌కీపర్‌ సంచలన నిర్ణయం

ఉమ్రాన్​ను పక్కకు పెట్టడంపై మాజీ ఆల్​రౌండర్​ అసంతృప్తి - 'అతడి విషయంలో నా అంచనాలు తప్పాయి'

Last Updated : Dec 1, 2023, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.