ETV Bharat / sports

T20 WorldCup: 'ఆ బాధ్యత కోహ్లీ, రోహిత్​దే' - T20 world cup gambhir

టీ20 ప్రపంచకప్​లో ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గంభీర్​. అలాంటి పరిస్థితి రానివ్వకుండా సారథి కోహ్లీ, రోహిత్​ బాధ్యత తీసుకోవాలని సూచించాడు.

kohli
కోహ్లీ
author img

By

Published : Jul 17, 2021, 12:56 PM IST

యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్​ డ్రా వెలువడిన నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​ గౌతమ్​ గంభీర్​ స్పందించాడు. అక్టోబర్​లో ప్రారంభమయ్యే ఈ మెగాటోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్​, పాక్​లు తలపడనున్నాయి. అయితే ఈ రెండు జట్లు మధ్య జరిగే పోరులో ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతారని అన్నాడు. అలాంటి పరిస్థితి రానివ్వకుండా సారథి కోహ్లీ, రోహిత్​ శర్మ బాధ్యత తీసుకోవాలని చెప్పాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్​తో తాను ఆడిన తొలి మ్యాచ్​ను గుర్తుచేసుకున్నాడు.

"పాకిస్థాన్​తో నా తొలి మ్యాచ్​ ఆడేటప్పుడు ఎక్కువ ఉత్సాహానికిలోనై ఒత్తిడికి గురయ్యాను. అలాగే రాబోయే ప్రపంచకప్​లో కొంతమంది ఆటగాళ్లకు ఈ విధంగానే అవ్వొచ్చు. కాబట్టి ఇలా జరగకుండా ఉండే బాధ్యతను కోహ్లీ, రోహిత్ శర్మ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్​ ఇరు దేశాల మధ్య ఉండే భావోద్వేగాల సమ్మేళనం. కేవలం బ్యాట్​, బంతి మధ్య జరిగే పోరు కాదు అంతకన్నా ఎక్కువ."

-గంభీర్​, మాజీ క్రికెటర్​.

టీమ్​ఇండియా మాజీ బ్యాట్స్​మన్​ ఊతప్ప మాట్లాడుతూ.. "భారత్​-పాక్​ మధ్య అంటే ఆటగాళ్లతో పాటు క్రికెట్​ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తారు. దాయాదుల మధ్య మ్యాచ్​ అంటేనే భావోద్వేగాలు సమ్మేళనం. ఇరు జట్లపై గెలుపు అంచనాలు సమానంగా ఉంటాయి." అని అన్నాడు.

అక్టోబర్​ 17 నుంచి నవంబరు 14 వరకు ఈ టీ20 ప్రపంచకప్​ జరగనుంది. మార్చి 2021 నాటి ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ మెగాటోర్నీ డ్రాను ప్రకటించారు. దీనిని సూపర్ 12 మ్యాచ్​లుగా నిర్వహించనున్నారు.

గ్రూప్ 1- వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ గ్రూప్-ఏ విజేత, గ్రూప్-బీ రన్నరప్​

గ్రూప్​ 2- భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, క్వాలిఫయర్ గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్​-బీ విజేత

క్వాలిఫయర్స్​

టీ20 ప్రపంచకప్​లో క్వాలిఫై కోసం ఏకంగా ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. వీటి మధ్య రౌండ్ 1 పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో గ్రూప్​ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్​, నమీబియా ఉన్నాయి. గ్రూప్ బీ లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

ఈ క్వాలిఫయర్స్​లోని గ్రూప్​ ఏ విజేత, గ్రూప్ బీ రన్నరప్​ సూపర్ 12 విభాగంలో గ్రూప్​ 1లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికాలతో పోటీపడనున్నాయి. తర్వాత గ్రూప్ బీ విజేత​, గ్రూప్ ఏ రన్నరప్​ సూపర్ 12 విభాగంలో గ్రూప్ 2లోని భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​, న్యూజిలాండ్​తో పోటీపడతాయి.

ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్: భారత్​- పాక్​ 'మ్యాచ్'​ ఫిక్స్​- ఫ్యాన్స్​ ఖుష్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.