టీ20 ప్రపంచకప్ కంటే(T20 World Cup) ముందు భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. అంతకుముందే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌ల్లో తడపడనుంది టీమ్ఇండియా. ఇంగ్లాండ్‌తో అక్టోబరు 18న, ఆస్ట్రేలియాతో అక్టోబరు 20న ఈ మ్యాచ్‌లు జరగనుంది.
జట్టులోకి అశ్విన్..
సెప్టెంబర్ 8న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు టీమ్ఇండియా జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. అశ్విన్.. చివరి టీ20 2017 జులైలో వెస్టిండీస్‌తో ఆడాడు. దాంతోపాటు మాజీ సారథి ధోనీని మెంటార్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.
మొదట భారత్‌లోనే టీ20 వరల్డ్‌కప్(T20 World Cup) జరగాల్సిఉంది. కానీ కరోనా మహమ్మారి దృష్ట్యా యూఏఈ, ఒమన్‌లో జరగనున్నాయి.
మార్చి 2021నాటి ర్యాంకింగ్స్ ఆధారంగా ఇటీవలే ఈ మెగాటోర్నీకి సంబంధించిన డ్రాను ప్రకటించారు. ఇందులో దాయాది దేశాలు భారత్-పాక్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దీనిని సూపర్ 12 మ్యాచ్‌లుగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు(t20 world cup schedule 2021) జరగనుంది.
- గ్రూప్ 1- వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ గ్రూప్-ఏ విజేత, గ్రూప్-బీ రన్నరప్
- గ్రూప్ 2- భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, క్వాలిఫయర్ గ్రూప్-ఏ రన్నరప్, గ్రూప్-బీ విజేత
- ఫస్ట్ సెమీఫైనల్.. అబుదాబి.. నవంబర్ 10
- సెకండ్ సెమీఫైనల్..దుబాయ్..నవంబర్ 11
- ఫైనల్.. దుబాయ్.. నవంబరు 14(ఆదివారం)
ఇదీ చదవండి: T20 World Cup: భారత టీ20 ప్రపంచకప్ జట్టు.. మెంటార్‌గా ధోనీ