ETV Bharat / sports

షారుక్ ఖాన్, సునీల్​ నరైన్​ ఊచకోత.. టీ20ల్లో 'బ్లాస్ట్'​ పెర్​ఫార్మెన్స్​! - షారుక్ ఖన్ టీఎన్​పీఎల్

T20 Blast 2023 : ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్​ 2023లో నరైన్ బ్యాట్​తో చెలరేగాడు.​ మరోవైపు తమిళనాడు ప్రీమియర్​ లీగ్​లో యువ బ్యాటర్ షారుక్ ఖాన్ మెరుపు అర్ధ శతకం బాదాడు.

T20 Blast 2023
నరైన్, షారుక్ అద్భుత ప్రదర్శన
author img

By

Published : Jul 3, 2023, 12:59 PM IST

Updated : Jul 3, 2023, 4:09 PM IST

T20 Blast 2023 : ఇంగ్లాండ్ వేదికగా జరగుతున్న టీ20 బ్లాస్ట్​ లీగ్​లో విండీస్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆదివారం ఎసెక్స్​ జట్టుతో జరిగిన మ్యాచ్​లో రెచ్చిపోయి 37 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్​లో 6 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. బౌండరీల ద్వారానే నరైన్ 64 పరుగులు సాధించాడు. అతడి విధ్వసంతో సర్రె జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం 196 లక్ష్య ఛేదనలో దిగిన ఎసెక్స్‌ ఆదిలోనే వికెట్​ కోల్పోయినా.. మరో ఓపెనర్ లారెన్స్ (58), మైఖెల్ పెప్పర్ (75) వీరోచితంగా పోరాడిల తమ జట్టుకు విజయాన్ని అందించారు.

లాస్ట్ బాల్​కు సిక్స్​..
ఎసెక్స్ విజయానికి ఆఖరి రెండు ఓవర్లలో 16 పరుగులు కావాల్సివచ్చింది. అయితే వారి విజయం సులువే అనుకున్న తరుణంలో 19వ ఓవర్ వేసిన క్రిస్ జోర్డన్.. కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. ఇక చివరి ఆరు బంతులకు 8 పరుగులు అవసరమయ్యాయి. 20వ ఓవర్​లో మొదటి ఐదు బంతులకు ఐదు పరుగులే వచ్చాయి. దీంతో ఉత్కంఠ పెరిగింది. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన దశలో ఎసెక్స్​ బ్యాటర్ ఫెరోజ్‌ ఖుషీ అద్భుతమైన సిక్స్​ కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్​లో సర్రె జట్టు ఓడినప్పటికీ అద్భుత ప్రదర్శన చేసిన నరైన్​కే మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా జూలై 15న ఎడ్జ్​బాస్టన్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

TNPL 2023 : తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఆదివారం మధురై పాంథర్స్​, కోవై కింగ్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో కోవై కింగ్స్ జట్టు కెప్టెన్ షారుక్ ఖాన్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (23 బంతుల్లో 53 : 6x4, 3x6) చేశాడు. బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోవై కింగ్స్​ 208 పరుగులు చేసింది. అటు బౌలింగ్​లోనూ ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చి.. ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు షారుక్ ఖాన్. మధురై 164 పరుగులకే ఆలౌట్​ అయ్యింది. దీంతో కోవైకింగ్స్ 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఛేదనను మధురై ఘనంగానే ఆరంభించినా.. ఆఖర్లో ఆ జట్టు బ్యాటర్లు లయ తప్పారు. 10 ఓవర్లకు మధురై 2 వికెట్ల నష్టానికి 95 పరుగులతో పటిష్ఠమైన స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాతే కోవై బౌలర్లు విజృంభించారు. కేవలం ఎనిమిది ఓవర్లలో 69 పరుగులు ఇచ్చినప్పటికీ.. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడం వల్ల విజయం కోవైను వరించింది. ఆల్​రౌండ్ ప్రదర్శన కనబర్చిన కెప్టెన్ షారుక్​ ఖాన్​కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు లభించింది. కాగా ఈ విజయంలో కోవై కింగ్స్ టేబుల్​ టాపర్​గా కొనసాగుతోంది. జూలై 12న ఫైనల్​ జరగనుంది.

Last Updated : Jul 3, 2023, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.