ETV Bharat / sports

43 బంతుల్లోనే 193 పరుగులు - టీ10 క్రికెట్​లో వరల్డ్​ రికార్డ్​ - టీ 10 క్రికెట్​లో వరల్డ్​ రికార్డు

T10 Highest Score Batsman : యూరోపియన్ క్రికెట్ (టీ10) లీగ్​లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఓ బ్యాటర్ ఏకంగా 43 బంతుల్లోనే 193 పరుగులు చేశాడు.

T10 Highest Score Batsman
T10 Highest Score Batsman
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 4:18 PM IST

Updated : Dec 8, 2023, 4:28 PM IST

T10 Highest Score Batsman : క్రికెట్​లో ఫార్మాట్​ మారుతున్న కొద్ది రికార్డులు కూడా ఆ రేంజ్​లోనే నమోదవుతున్నాయి. గత కొన్నేళ్లుగా టీ20కి అడ్వాన్స్​డ్​గా టీ10 ఫార్మాట్​ను ప్రవేశపెట్టాయి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు. యూఏఈ, ఖతార్, వెస్టిండీస్, యూరోపియన్, ఆఫ్రికాతో పాటు పలు దేశాల బోర్డులు, టీ10 ఫార్మాట్​ లీగ్​లు నిర్వహిస్తున్నాయి. ఈ ఫార్మాట్​లో పార్ట్​నర్​షిప్​లు, క్రీజులో కుదురుకోవడాలు ఉండట్లేదు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్టే బంతిని బౌండరీ దాటించే పనిలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూరోపియన్ టీ10 లీగ్​లో వరల్డ్​ రికార్డు నమోదైంది.

యూరోపియన్ క్రికెట్ (టీ10) లీగ్​లో భాగంగా కాటలున్యా జాగ్వార్ - సోహల్ హాస్పిటల్టెట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన కాటలున్యా జట్టు 10 ఓవర్లలోనే 257 భారీ స్కోర్​ చేసింది. ఈ జట్టులో బ్యాటర్ హమ్జా సలీమ్‌ దార్ 43 బంతుల్లోనే 193* పరుగులు (448.86 స్ట్రైక్ రేట్) చేసి ఔరా అనిపించాడు. ఇందులో 14 ఫోర్లు, 22 సిక్స్​లు ఉన్నాయి. అంటే బౌండరీల ద్వారానే అతడు 188 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో టీ10 హిస్టరీలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్​గా సలీమ్‌ దార్ నిలిచాడు. ఇంతకుముందు ఈ జాబితాలో లూయిస్‌ డు ప్లూయ్‌ (163 పరుగులు) ఉన్నాడు. తాజా ఇన్నింగ్స్​తో సలీమ్‌ దార్, లూయిస్‌ రికార్డు బద్దలుకొట్టాడు. ఇక హలీమ్​దార్ టీ10 కెరీర్​లో 3 వేల పరుగుల మార్క్ క్రాస్ చేశాడు.

  • A batsman in the European Cricket Series has smashed the record books with a sensational 193 from just 43 balls in a T10 match.

    Batting for Catalunya Jaguar, Hamza Saleem Dar hit 22 sixes and 14 fours on the way to the record-breaking score, striking a mind-blowing 449. https://t.co/YOh6EyZ6h7

    — Cricket Connected (@CricketConnect9) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 258 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన సోహల్ హాస్పిటల్టెట్ జట్టు, పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. దీంతో కాటలున్యా 153 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో సలీమ్ దార్​తోపాటు యాసిర్‌ అలీ, కేవలం 19 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. హాస్పిటల్టెట్ జట్టు బౌలర్ వారిస్‌ ఒక్క ఓవర్‌లోనే 43 పరుగులు సమర్పించుకోవడం విశేషం.

క్రికెట్​లో విచిత్రమైన నో బాల్ - వీడియో వైరల్ - మీరు చూశారా?

యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌.. 14 బంతుల్లో 61 రన్స్.. థ్రిల్లింగ్​గా వీడియో!

Last Updated : Dec 8, 2023, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.