టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్(team india fielding coach)గా మరోసారి తెలుగువాడికే అవకాశం దక్కింది! వరంగల్‌కు చెందిన టి.దిలీప్ టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికైనట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో హైదరాబాదీ ఆర్.శ్రీధర్ స్థానంలో ఫీల్డింగ్ కోచ్‌గా దిలీప్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
హెచ్‌సీఏ ఎ-డివిజన్ లీగ్స్‌లో కాంటినెంటల్ సీసీ తరఫున దిలీప్ బరిలో దిగాడు. బీసీసీఐ లెవెల్-3 కోర్సు పూర్తి చేసిన దిలీప్.. 14 ఏళ్ల కోచింగ్ కెరీర్‌లో టీమ్‌ఇండియా, ఇండియా అండర్-19, ఫస్ట్‌క్లాస్ జట్లకు ఫీల్డింగ్ శిక్షకుడి(team india fielding coach)గా పని చేశాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియాకు దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో టీమ్‌ఇండియా చీఫ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్(rahul dravid head coach).. దిలీప్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ద్రవిడ్ సహచరుడు.. ఇండియా-ఎ, ఇండియా అండర్-19 జట్లకు ఫీల్డింగ్ కోచ్(team india fielding coach)గా పని చేసిన అభయ్‌శర్మను కాదని దిలీప్‌ను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎన్‌సీఏలో అభయ్ సేవలు అవసరమని భావించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) దిలీప్‌కు ఓటు వేసినట్లు తెలిసింది. దిలీప్ ఎంపిక పట్ల హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్ ఆనందం వ్యక్తం చేశారు.
బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్
ప్రస్తుతం టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్(team india batting coach)గా పనిచేస్తున్న విక్రమ్ రాథోర్‌కు మరోసారి ఆ అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రేను ఎంపికచేసినట్లు సమాచారం. నవంబర్ 17న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనతో వీరు బాధ్యతలు చేపట్టనున్నారు.