ETV Bharat / sports

T20 world cup 2021: పాక్​తో మ్యాచ్​ కోసం కోహ్లీకి ధోనీ టిప్స్!

టీ20 ప్రపంచకప్​.. విరాట్ కోహ్లీ, ధోనీకి ఎంతో ప్రత్యేకమైనది. ఒకరికి చివరి అవకాశం కాగా.. మరొకరికి మొదటి సవాలు. ఈ సారి భారత్​కు కప్పు తెచ్చి తీరతామని (T20 world cup 2021 latest news) తాము నిరూపించుకోవాలని చూస్తున్నారు ఈ క్రికెట్ వీరులు. ఈ క్రమంలో మాస్టర్​ మైండ్ ధోనీ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు కోహ్లీ. అక్టోబర్ 24న భారత్​- పాక్ మ్యాచ్ నేపథ్యంలో భారత జట్టు నెట్​లో ప్రాక్టీస్​ చేస్తోంది.

T20 world cup 2021
ధోనీ పాఠాలు
author img

By

Published : Oct 24, 2021, 10:58 AM IST

టీ20 ప్రపంచకప్(T20 world cup 2021 latest news)​ మొదలైంది. ప్రపంచ దేశాలు ట్రోఫీ కోసం నువ్వా-నేనా అన్నట్లు పోరాటాన్ని ప్రారంభించాయి. అయితే టీమ్​ఇండియా పరంగా చూస్తే.. కోహ్లీ, ధోనీలకు ఈ టోర్నీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకరికి చివరి అవకాశం కాగా మరొకరికి కొత్త సవాలు. ఇరువురు క్రికెట్ ప్రపంచంలో ఓ మెరుపు మెరిసిన వీరులే. ఈ క్రమంలో మాస్టర్​ మైండ్​ ధోనీ (dhoni as mentor in t20) నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు విరాట్ కోహ్లీ.

T20 world cup 2021
కోహ్లీ, ధోనీ

అపనింద..

మైదానంలో విరాట్ కోహ్లీ దిగాడంటే (T20 world cup 2021 updates) పరుగుల వరద కురిపిస్తాడు. వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులను సాధించాడు. అయినప్పటికీ.. ఓ వెలితి కోహ్లీని వెంటాడుతూనే ఉంది. టీమ్​ఇండియాకు తాను సారథ్యం వహించినప్పటి నుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీ తీసుకురాలేదనే వెలితితో కోహ్లీ ఉన్నాడు. వ్యక్తిగతంగా ఎంత నైపుణ్యమున్నా సరే.. జట్టును నడిపించడంలో విఫలమైతే సాధారణంగా అవేవీ పట్టించుకోరు. ఎవరైనా కోహ్లీ సారథ్యంలో భారత్​కు కప్పు వచ్చిందా? లేదా? అనే చూస్తారు. ఈసారైనా ట్రోఫీని సాధించి ఆ అపనిందను దూరం చేసుకోవాలనే సంకల్పంతో కోహ్లీ ఉన్నాడు!

T20 world cup 2021
నెట్​ ప్రాక్టీస్​లో కోహ్లీ

చివరి అవకాశం..

టీ20 ప్రపంచకప్​ మొదలుకాక మునుపే క్రికెట్​లో పొట్టి ఫార్మాట్​ కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు చెప్పనున్నాడని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఈ టీ20 ప్రపంచకప్​ అనంతరం టీ20 కెప్టెన్​ బాధ్యతల నుంచి తాను వైదొలగనున్నానని ప్రకటించాడు. ఈ వరల్డ్​ టోర్నీనే కోహ్లీకి చివరి అవకాశం. ఈ సారైనా ఐసీసీ టోర్నీల్లో ఒకటైన టీ20 ట్రోఫీ సాధించాలని కోహ్లీ పట్టుదలతో ఉన్నాడు.

ధోనీకి కొత్త సవాలు..

ధోనీ అంటేనే క్రికెట్​ మాస్టర్ మైండ్​ అని పేరు. మహీ బుర్రలో క్రికెట్​ గ్రౌండ్ 360 డిగ్లీల్లో వ్యూహాలు ఉంటాయంటారు. అటు మైదానంలో తానెంటో నిరూపించుకుంటూ వచ్చాడు ధోనీ. సరైన సమయాల్లో సరైన ఆటగాడిని ఉపయోగించిన విజయాలు సాధించడంలో తనకు తానే సాటి. తన సారథ్యంలో భారత్​కు వన్డే, టీ20, ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీలు తీసుకువచ్చి సక్సెస్​ఫుల్ కెరీర్​లో ఉన్నాడు. ధోనీ వ్యూహాలకు మెచ్చి అతన్ని ఇటీవల టీమ్​ఇండియాకు మెంటార్​గా (dhoni as mentor in t20) నియమించింది బీసీసీఐ. మైదానంలో ఉండి ఆటను నడిపించడం వేరు. రెస్ట్ రూమ్​లో కూర్చుని గెలుపు వ్యూహాలు రచిచండం వేరు. మరి.. ఈ కొత్త బాధ్యతల్లోనూ విజయం సాధించి మరింత సక్సెస్​ఫుల్​గా నిలవాలని ధోని ఆశాభావంతో ఉన్నాడు.

T20 world cup 2021
ప్రాక్టీస్​లో టీమ్​ఇండియా

కోహ్లీకి.. ధోనీ పాఠాలు

టీ20 ప్రపంచకప్​లో అక్టోబర్ 24న భారత్-పాక్ (india vs pakistan match) తలపడనున్నాయి. వార్మప్ మ్యాచ్​లను పూర్తి చేసుకున్న ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్​. చిరకాల ప్రత్యర్థితో మొదటి మ్యాచ్ అంటే కాస్త టీమ్​ఇండియాకు సవాలు​తో కూడిన విషయం. దాయాదితో ఆట భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. చాలా ఏళ్లుగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు లేవు. ఈ మ్యాచ్ ఓడితే సిరీస్​ మొదట్లోనే తిరస్కారాలు ఎదురైతాయి. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని టీమ్​ఇండియా భావిస్తోంది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు గ్రౌండ్లో ప్రాక్టీస్​ షురూ చేశారు. నెట్​లో బ్యాటింగ్, బౌలింగ్​కు పదునుపెట్టుకుంటున్నారు. మెంటార్ అడుగుజాడల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. మెంటార్ ధోనీ నుంచి కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ పాఠాలు నేర్చుకుంటున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:kohli retirement news: రిటైర్మెంట్​పై విమర్శలకు కోహ్లీ కౌంటర్​

INS VS PAK T20: హై ఓల్టేజీ మ్యాచ్​లో పైచేయి ఎవరిదో!

T20 world cup 2021: దాయాదితో పోరు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.