ETV Bharat / sports

T20 world cup 2021: దాయాదితో పోరు.. హిస్టరీ రిపీట్ అవుతుందా? - టీ20 ప్రపంచకప్ అప్​డేట్స్​

దాయాదుల పోరంటేనే భావోద్వేగాలతో ముడిపడి ఉండే అంశం. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌ల ఊసే లేనందున ఐసీసీ మెగా టోర్నీల్లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ (T20 world cup 2021 updates) కోసం క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఇరు జట్లు తలపడనుండగా ఇది భారత్-పాకిస్థాన్ మధ్య 200వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం దీని ప్రాధాన్యతను మరింత పెంచింది.

T20 world cup 2021
భారత్​ వర్సెస్ పాకిస్థాన్​
author img

By

Published : Oct 24, 2021, 9:00 AM IST

చాలాకాలం కిందట భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో ఎక్కువగా దాయాది (T20 world cup 2021 updates) జట్టునే విజయం వరించింది. అయితే కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారుతూ వస్తోంది. పాకిస్థాన్​పై టీమ్ఇండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇక ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో మాత్రం పాకిస్థాన్‌ మీద భారత్​దే పూర్తి పైచేయి. వన్డే వరల్డ్‌కప్‌లు సహా టీ20 ప్రపంచకప్‌ మ్యాచుల్లో పాక్‌పై భారత్​దే సంపూర్ణ ఆధిపత్యం. ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో ఏడుసార్లు.. టీ20 వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు ఇరుజట్లు ఢీకొన్నాయి. అన్నింట్లోనూ టీమ్​ఇండియానే గెలుపొందింది.

T20 world cup 2021
భారత్​ వర్సెస్ పాకిస్థాన్​

భారతే ఫేవరెట్..

కొన్నేళ్ల కిందట వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక (ind vs pak cricket latest news) సిరీస్‌లు జరిగాయి. ఉగ్రవాదాన్ని పాక్‌ ప్రోత్సహిస్తుండడం వల్ల ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు భారత్‌ నిరాకరించడం వల్ల ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు నిలిచిపోయాయి. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి ఇరు జట్లు 199 మ్యాచ్‌ల్లో ఢీకొనగా.. భారత్‌ 70 మ్యాచుల్లో విజయం సాధించింది. పాకిస్థాన్‌ 86 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో 42 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇరుజట్ల మధ్య 59 టెస్టులు జరగగా భారత్‌ 9, పాకిస్థాన్‌ 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. 38 మ్యాచులు డ్రాగా ముగిశాయి. అలానే 132 వన్డేల్లో.. టీమ్ఇండియా 55, పాకిస్థాన్‌ 73 మ్యాచుల్లో గెలుపొందగా.. నాలుగు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. టీ20ల్లో ఆధిక్యం మాత్రం భారత్‌దే. ఎనిమిది మ్యాచుల్లో ఆరు టీమ్ఇండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పొరుగు దేశం గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది.

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్

2009, 2010 టీ20 ప్రపంచకప్‌ మ్యాచుల్లో భారత్‌-పాకిస్థాన్‌ జట్లు ముఖాముఖిగా ఢీకొనలేదు. 2009లో భారత్‌ సూపర్‌-8 స్టేజ్‌లోనే నిష్క్రమించగా.. పాక్‌ ఫైనల్‌కు దూసుకెళ్లి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2010లోనూ టీమ్ఇండియా సూపర్‌-8కే పరిమితమైంది. పాకిస్థాన్‌ సెమీస్‌ వరకు చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

ఇదీ చదవండి:T20 world cup 2021: భారత్​, పాక్ మ్యాచ్​పై దిగ్గజాల అభిప్రాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.