ఆస్ట్రేలియాలో జరుగుతోన్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో టీమ్‌ఇండియా యువ సంచలనం షెఫాలీ వర్మ సిడ్నీ సిక్సర్స్ తరఫున గురువారం అరంగేట్రం చేసింది. అయితే, తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో పరుగుల వరద పారించలేకపోయిన ఆమె అంతకుముందు ఫీల్డింగ్‌లో ఓ మెరుపు రనౌట్ చేసింది. డైరెక్ట్ త్రో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపింది. ఈ వీడియోను ఓ ఆస్ట్రేలియా క్రికెట్ వెబ్‌సైట్ సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా అభిమానులు మెచ్చుకుంటున్నారు. 'వావ్, ఎక్స్‌లెంట్ ఫీల్డింగ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు షెఫాలీని టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పోలుస్తూ 'లేడీ జడేజా' అంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
-
What a throw! Welcome to the @WBBL, Shafali Verma 🔥@CommBank | #WBBL07 pic.twitter.com/X6mhtzwUp8
— cricket.com.au (@cricketcomau) October 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a throw! Welcome to the @WBBL, Shafali Verma 🔥@CommBank | #WBBL07 pic.twitter.com/X6mhtzwUp8
— cricket.com.au (@cricketcomau) October 14, 2021What a throw! Welcome to the @WBBL, Shafali Verma 🔥@CommBank | #WBBL07 pic.twitter.com/X6mhtzwUp8
— cricket.com.au (@cricketcomau) October 14, 2021
మెల్‌బోర్న్ స్టార్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సిడ్నీ సిక్సర్స్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ఎల్లీస్సీ పేరీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ ఐదో బంతికి మెల్‌బోర్న్ బ్యాటర్ ఎలీసీ విల్లాని షార్ట్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా షాట్ ఆడింది. అయితే, నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సుదర్‌లాండ్ అనే మరో బ్యాటర్ క్రీజు వదిలి కాస్త ముందుకెళ్లింది. అప్పుడే షెఫాలి బంతి అందుకొని వికెట్లకేసి డైరెక్ట్ త్రో విసిరింది. దీంతో క్రీజు బయటున్న సుదర్‌లాండ్(14) పెవిలియన్ చేరాల్సి వచ్చింది. దీనికి మంత్రముగ్ధులైన కామెంటేటర్లు కూడా ఆమెను మెచ్చుకున్నారు. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ ఒక వికెట్ నష్టానికి 99 పరుగులు చేసింది. విల్లాని(54), లాన్నింగ్(23) చివరివరకూ బ్యాటింగ్ చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం సిడ్నీ సిక్సర్స్ బ్యాటర్లు నాలుగు వికెట్లు కోల్పోయి 10.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఓపెనర్ అలిస్సా హేలీ (57)అర్ధశతకంతో మెరిశారు. షెఫాలీ(8) పరుగులకే పెవిలియన్ చేరి బ్యాటింగ్‌లో నిరాశపరిచింది.
ఇదీ చూడండి.. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగమైన యూనిసెఫ్