టీ20 జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(virat kohli steps down as indian captain) తప్పుకోనున్నాడు. టీ20 ప్రపంచ కప్(t20 world cup 2021 india team) తర్వాత ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా ఉన్నానని.. ఇకపై టెస్టు, వన్డే సారథ్య బాధ్యతలపై ఎక్కువగా దృష్టిపెడతానని అతడు చెప్పాడు. పొట్టి క్రికెట్లో బ్యాటర్‌గా రాణిస్తానని చెప్పాడు. ఈ అనూహ్య నిర్ణయంతో అభిమానులు షాకయ్యారు. వచ్చే ఏడాది(2022)లో టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో కోహ్లీ తన రిటైర్మెంట్పై తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడనే విమర్శలు ఎదురవుతున్నాయి. దీనిపై విరాట్ స్పందించాడు. కొందరు జరగని విషయాలను తవ్వుకుంటూ కూర్చుంటారని అన్నాడు. అక్టోబర్ 24న పాక్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన కాన్ఫరెన్స్‌లో కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"మ్యాచ్ ముందు రిటైర్మెంట్పై స్పందించడం ఇష్టం లేదు. నేను ఇప్పటికే వివరంగా చెప్పాను. దానిపై ఇంకా చర్చించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ప్రపంచకప్‌పైనే మా దృష్టి ఉంది. కొందరు లేని విషయాలను ముందేసుకుని తవ్వుకుంటూ కూర్చుంటారు. అలాంటివారి వ్యాఖ్యలపై నేను స్పందించను. రిటైర్మెంట్పై ఇంకా చర్చించాలనుకుంటే అలాంటివారి పట్ల నేను విచారం వ్యక్తం చేస్తాను"
-విరాట్ కోహ్లీ
కోహ్లీ రిటైర్మెంట్పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఇటీవల స్పందించాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే నిర్ణయం కోహ్లీదేనని, బీసీసీఐ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని గంగూలీ అన్నాడు.
ఇదీ చదవండి:ganguly on kohli captaincy: కోహ్లీ కెప్టెన్సీ నిర్ణయంపై గంగూలీ ఆశ్చర్యం