కేఎల్ రాహుల్(kl rahul news).. మంచి ఫామ్ కొనసాగిస్తూ అగ్రశేణి ఆటగాళ్ల సరసన చేరిన టీమ్ఇండియా ఓపెనర్. టీ20 ప్రపంచకప్(T20 world cup 2021) కోసం ఎంపికై బయోబబుల్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి యూఏఈకే (T20 world cup updates) పరిమితమయ్యాడు. గతేడాది ఐపీఎల్‌తో మొదలై దాదాపు 13 నెలలుగా బయోబబుల్‌లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బయోబబుల్ అనుభవాల గురించి మాట్లాడాడు. నిర్బంధంగా ఉండడం చాలా కష్టమని అన్నాడు.
"2020 ఐపీఎల్ మొదటి బయోబబుల్. కరోనాతో దాదాపు ఐదు నెలలు క్రికెట్‌కు దూరమైన కారణంగా అది బాగానే అనిపించింది. కాలం గడిచేకొద్ది కష్టంగా అనిపించింది. కానీ టీమ్ మొత్తం కలిసి ఉండటానికి ఇదే కారణమైంది. ఒకరికొకరం కలిసి ఉండే అవకాశం దక్కింది. కానీ ఆటతో పాటు బయోబబుల్‌ను కూడా అలవాటు చేసుకోవాలి"
-కేఎల్ రాహుల్, టీమ్ఇండియా ఓపెనర్
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇంగ్లాండ్‌తో పోరులో రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అఫీషియల్ మ్యాచ్‌లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. టీ20 ప్రపంచకప్ తర్వాత ఎలాంటి ప్రణాళికలున్నాయని రాహుల్‌ను అడగ్గా.. 2050 వరకు తీరికలేని షెడ్యూల్ ఉందని సరదాగా సమాధానమిచ్చాడు.
ఇదీ చదవండి:T20 world cup: ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్.. బరిలోకి హిట్‌మ్యాన్