లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అడనున్నాడు. క్యాండీ టస్కర్స్ ఫ్రాంఛైజీ కాంట్రాక్టులో సంతకం చేశాడు. మ్యాచ్లు ఆడేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
టస్కర్స్ జట్టులో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్, లంక ఆటగాళ్లు కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, నువాన్ ప్రదీప్, ఇంగ్లాండ్ బౌలర్ ప్లంకెట్ ఉన్నారు. శ్రీలంక మాజీ సారథి తిలకరత్నే కోచ్గా వ్యవహరిస్తున్నారు.
ఇర్పాన్ రావడం జట్టుకు ఎనలేని శక్తిని అందిస్తుందని క్యాండీ టస్కర్స్ యజమాని, నటుడు సోహైల్ ఖాన్ అన్నాడు. ఇతడి రాకతో అభిమానులు సంతోషిస్తారని ఎల్పీఎల్ టోర్నీ డైరెక్టర్ రవిన్ విక్రమరత్నే అభిప్రాయపడ్డారు.
లంక ప్రీమియర్ లీగ్.. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 13 వరకు జరగనుంది. మహేంద్ర రాజపక్సే అంతర్జాతీయ స్టేడియం, పల్లెకెల క్రికెట్ మైదానంలో మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం ఐదు జట్లు తలపడనున్నాయి.
ఇదీ చూడండి:కెప్టెన్ హాట్ విరాట్ కోహ్లికి.. ఈ పుట్టిన రోజు డబుల్ ధమాకా!