ETV Bharat / sports

IND vs NZ: 'కోహ్లీ తిరిగొచ్చినా.. మూడో స్థానంలో అతడే ఆడాలి' - suryakumar yadav batting position

సూర్యకుమార్​ యాదవ్​ను మూడో స్థానంలో ఆడించడం టీమ్‌ఇండియాకు కలిసివస్తుందని అన్నాడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir News). టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. తిరిగి జట్టులోకి వచ్చినా అతడిని మూడో స్థానంలోనే కొనసాగించాలని సూచించాడు.

Virat Kohli
విరాట్‌ కోహ్లీ
author img

By

Published : Nov 18, 2021, 6:28 PM IST

Updated : Nov 18, 2021, 7:30 PM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ (Virat Kohli News) తిరిగి జట్టులోకి వచ్చినా సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో స్థానంలోనే ఆడాలని మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. బుధవారం రాత్రి న్యూజిలాండ్‌తో (India vs New Zealand) జరిగిన తొలి టీ20 పోరులో సూర్యకుమార్‌ (62) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన గంభీర్‌ (Gautam Gambhir News) ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్య (Suryakumar Yadav News) అన్ని వైపులా షాట్లు ఆడగలడని, స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటాడని మాజీ ఓపెనర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలోనే కోహ్లీ తిరిగొచ్చినా అతడినే మూడో స్థానంలో చూడాలనుకుంటున్నట్లు తన మనసులోని మాట వెలిబుచ్చాడు.

Suryakumar Yadav News
సూర్యకుమార్‌ యాదవ్‌

సూర్యను మూడో స్థానంలో (Suryakumar Yadav Batting Position) ఆడించడం టీమ్‌ఇండియాకు కలిసివస్తోంది. ప్రస్తుత ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ అద్భుతంగా ఆడుతున్నారు. వాళ్లిద్దరూ సాధిస్తున్న పరుగుల వేగాన్ని అతడు చక్కగా కొనసాగిస్తాడు. ఈ క్రమంలోనే విరాట్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు (Virat Kohli Batting Order) రావాలి. స్టీవ్‌స్మిత్‌ ఎలాగైతే ఆస్ట్రేలియా తరఫున నాలుగో స్థానంలో వస్తున్నాడో కోహ్లీ కూడా అటువంటి పాత్రే పోషించాలి. ఒకవేళ ఎప్పుడైనా జట్టు ఆదిలోనే పలు వికెట్లు కోల్పోతే అప్పుడు విరాట్‌ మిడిల్‌ ఆర్డర్‌ను ముందుకు నడిపించవచ్చు. మిడిల్ ఆర్డర్‌లో రిషభ్‌ పంత్‌ మినహా అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మన్‌ లేనందున కోహ్లీ అక్కడ ఆడితే సరిపోతుంది. కాబట్టి, అతడు నాలుగో స్థానంలో ఆడటం వల్ల జట్టులో కీలక పాత్ర పోషించడమే కాకుండా మిడిల్‌ ఆర్డర్‌ను బలోపేతం చేస్తాడు. అలాగే సూర్యకుమార్‌ ఎన్ని పరుగులు చేసినా చివరి వరకూ క్రీజులోనే ఉండి మ్యాచ్‌ గెలిపించడమే ముఖ్యం. ఈ విషయంలో నేను నిరాశ చెందా’ అని గంభీర్‌ తన అభిప్రాయాలను పంచుకొన్నాడు.

తొలి మ్యాచ్​ భారత్​దే..

జైపూర్​ వేదికగా తొలి టీ20లో(IND vs NZ t20 series 2021) న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

సూర్యకుమార్‌ యాదవ్‌ (62), కెప్టెన్‌ రోహిత్ శర్మ (48) రాణించారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (15)తో కలిసి రోహిత్ అర్ధశతక భాగస్వామ్మం నిర్మించాడు. రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మరో అర్ధశతకం (59) జోడించారు.

రోహిత్ ఔటైనప్పటికీ సూర్యకుమార్‌ ధాటిగానే బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో మూడో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్‌ కివీస్‌ బౌలర్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. రిషభ్‌ పంత్ 12*, శ్రేయస్‌ అయ్యర్ 5, వెంకటేశ్‌ అయ్యర్ 4 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సౌథీ, డారిల్ మిచెల్, సాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: IND vs NZ: 'బౌల్ట్‌.. నా భార్యకు పుట్టిన రోజు కానుక ఇచ్చాడు'

Last Updated : Nov 18, 2021, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.