శ్రీలంక టీ20 సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిపై స్పందించాడు. ఇదంతా ఓ కలగా ఉందని అన్నాడు. వాస్తవానికి అతడు వైస్‌కెప్టెన్‌గా ఎంపికైన విషయాన్ని అతడి తండ్రి అశోక్ కుమార్ యాదవ్ పంపిన మెసేజ్ ద్వారా సూర్య తెలుసుకొన్నాడు.
ప్రస్తుతం ముంబయి తరఫున సౌరాష్ట్రతో రంజీ మ్యాచ్ ఆడుతున్న అతడు మాట్లాడుతూ.. "ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మా నాన్న నుంచి ఈ విషయం తెలుసుకోవడం తనకి చాలా ఆనందంగా ఉందని, మా నాన్న జట్టు జాబితాతోపాటు.. ఓ మోటివేషనల్ కోట్ కూడా పంపారు, అదేంటంటే నువ్వు ఏమాత్రం ఒత్తిడికి గురికావద్దు.. నీ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయ్' అని ఉందని అలాగే ఈ ప్రమోషన్‌ను నేను ఏమాత్రం ఊహించలేదు. ఒక్కసారి కళ్లు మూసుకొని ఇది నిజమేనా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. ఈ అనుభూతి చాలా అద్భుతంగా ఉందని సూర్య తెలిపాడు. ఈ ఏడాది నా ఆటతీరుకు లభించిన రివార్డుగా నా తండ్రి సందేశాన్ని భావిస్తున్నట్లుగా సూర్య అన్నారు. ప్రస్తుతానికి భవిష్యత్తుపైనే దృష్టిపెట్టాను. ఇక ఒత్తిడి విషయానికి వస్తే నేను ఎప్పుడూ బాధ్యతలను, ఒత్తిడిని స్వీకరిస్తాను దాంతోపాటు ఎప్పుడూ నా ఆటనూ ఎంజాయ్ చేస్తాను..అంతకు మించి ఎక్కువగా ఆలోచించను. ఇది చాలా సులువు అని సూర్య చెప్పుకొచ్చారు. నేను హోటల్‌లో, నెట్స్‌లో ఉన్నప్పుడు జట్టు గురించే ఆలోచిస్తాను. ఎప్పుడైతే నేను బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి అడుగుపెడతానో.. ఇక నా ఆట పైనే దృష్టి పెట్టి ఎంజాయ్ చేస్తాను" అని తన సంతోషాన్ని పంచుకున్నాడీ మిస్టర్ 360.
సూర్యకుమార్ యాదవ్ 2022 టీ20ల్లో పలు సంచలనాలు సృష్టించాడు. మొత్తంగా ఈ ఏడాది 31 మ్యాచ్‌లు ఆడిన సూర్య 1164 పరుగులు చేశాడు. అందులో రెండు శతకాలు, 9 అర్ధశతకాలు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 187గా ఉందంటే ఫీల్డ్‌లో ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ప్రపంచ టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో కూడా తొలి స్థానంలో ఉన్నాడు. తాజాగా శ్రీలంక టీ20 సిరీస్‌కు హార్దిక్ కెప్టెన్‌గా ఎంపికవ్వగా సూర్యను వైస్ కెప్టెన్‌గా సెలెక్ట్ చేశారు.