ETV Bharat / sports

ఐపీఎల్‌కు సూర్యకుమార్ దూరం- ముంబయి ఇండియన్స్​కు గట్టి దెబ్బే! - సూర్యకుమార్ యాదవ్ ముంబయి

Surya Kumar Yadav Mumbai Indians : రానున్న ఐపీఎల్​ సీజన్​కు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ముంబయి ఇండియన్స్​కు గట్టి షాక్ తగలనుంది. ఆ టీమ్​కు సంబంధించిన స్టార్ క్రికెటర్​ సూర్య కుమార్ జట్టుకు దూరం కానున్నాడు. అసలేం జరిగిందంటే ?

Surya Kumar Yadav Mumbai Indians
Surya Kumar Yadav Mumbai Indians
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 10:56 AM IST

Updated : Jan 8, 2024, 11:18 AM IST

Surya Kumar Yadav Mumbai Indians : ఐపీఎల్ మొదలు కాకుండానే ముంబయి ఇండియన్స్​కు గట్టి షాక్ తగలనుంది. ఆ టీమ్​కు సంబంధించిన స్టార్ క్రికెటర్​ సూర్య కుమార్ జట్టుకు దూరం కానున్నాడు. అయితే మొత్తానికా లేకుంటే కొన్ని మ్యాచులకేనా అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ హెర్నియా అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఇప్పటికే అతడ గాయం కారణంగా టీమ్​ఇండియాకు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే. సౌతాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 సిరీస్‌లోనూ సూర్యకు చీలమండలానికి గాయమైంది. దీతో అతడు చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి మాత్రం నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే హెర్నియా సమస్యను పూర్తిగా తొలగించుకునేందుకు సూర్యకుమార్ ఓ సర్జరీ చేయించుకోనున్నాడు. దీని కోసం ఇప్పటికే బీసీసీఐ మెడికల్​ ఎక్స్​పర్ట్స్​ను కూడా సంప్రదించారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో విదేశాల్లో సూర్యకుమార్ ఆపరేషన్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే సర్జరీ తర్వాత సూర్య కోలుకోవడానికి కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వారాల సమయం పడుతుందని నిపుణుల అంచనా. దీంతో ఐపీఎల్​కు అతడు దూరమయ్యే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది.

మరోవైపు ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీని దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్‌ మొత్తానికి కూడా సూర్య రాకుండే ఉండే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఐపీఎల్ సమయానికి సూర్య కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటూ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ చికిత్స్ కారణంగా జనవరి 11 నుంచి ఆఫ్గానిస్థాన్​తో జరిగే మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు కూడా సూర్య దూరం కానున్నాడు.

India Vs Afghanistan T20 : ఆఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు టీమిడియా జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేశ్​ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, ముకేశ్​ కుమార్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్.

ఎవరూ టచ్​ చేయనంత దూరంలో సూర్య- 2024 వరల్డ్​కప్ దాకా పొజిషన్ సేఫ్!- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్

సూర్య భాయ్ ధనాధన్ సెంచరీ- రోహిత్ రికార్డ్ సమం- ప్రత్యర్థి ముందు భారీ టార్గెట్

Last Updated : Jan 8, 2024, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.