Super Over Rules Cricket: బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. దీంతో 2024లో భారత్ తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్రేక్షకులకు ఆసాంతం వినోదం పంచిన ఈ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలుత సెంచరీ (121*) నమోదు చేసిన హిట్‌మ్యాన్ వరుసగా రెండు సూపర్ ఓవర్లలో 14, 11 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
అయితే రెండు సూపర్ ఓవర్లలోనూ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడం పట్ల అఫ్గాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ఫీల్డ్ అంపైర్లకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలోనూ వీపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. కాగా, రోహిత్ ఐసీసీ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాడని అంపైర్లు పేర్కొన్నారు. తొలి సూపర్ ఓవర్లో రోహిత్ (14) రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అందుకే రెండో సూపర్ ఓవర్లోనూ రోహిత్ బ్యాటింగ్ చేశాడని అంపైర్లు తెలిపారు.
రూల్స్ ప్రకారం- సూపర్ ఓవర్ ప్రారంభమయ్యే ముందు ఇరు జట్లు బరిలో దించే ప్లేయర్ల లిస్ట్ ఇవ్వాలి. అయితే లిస్ట్‌లో బ్యాటర్ తొలి సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయకపోయినా, నాటౌట్‌గా నిలిచినా రెండో సూపర్ ఓవర్లో మరోసారి బరిలో దిగవచ్చు. అదే విధంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా ఇదే రూల్ వర్తిస్తుంది. ఈ నిబంధనల ప్రకారమే అఫ్గాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ రెండోసారి బ్యాటింగ్ చేశాడు.
-
How #RohitSharma was able to bat again in Super Over 2. He was retired out and that does not count as dismissed ? Attaching rules from wiki.#INDvsAFG Needs clarification #AFGvsIND pic.twitter.com/CjWAkW1eQZ
— World of Sujith (@worldofsujith88) January 17, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">How #RohitSharma was able to bat again in Super Over 2. He was retired out and that does not count as dismissed ? Attaching rules from wiki.#INDvsAFG Needs clarification #AFGvsIND pic.twitter.com/CjWAkW1eQZ
— World of Sujith (@worldofsujith88) January 17, 2024How #RohitSharma was able to bat again in Super Over 2. He was retired out and that does not count as dismissed ? Attaching rules from wiki.#INDvsAFG Needs clarification #AFGvsIND pic.twitter.com/CjWAkW1eQZ
— World of Sujith (@worldofsujith88) January 17, 2024
మాకు తెలీదు!- ఇదిలా ఉండగా, సూపర్ ఓవర్ నిబంధనల పట్ల అవగాహన లేకపోవడం వల్ల అఫ్గానిస్థాన్ కోచ్ జొనాతన్ ట్రాట్ తాను కన్ఫ్యూజ్కు గురైనట్లు తెలిపాడు. 'నాకు రెండు సూపర్ ఓవర్ల పట్ల ఐడియా లేదు. రెండో సూపర్ ఓవర్లనూ మేం అజ్మతుల్లాతోనే బౌలింగ్ చేయించాలని డిసైడయ్యాం. కానీ, నిబంధనల గురించి తెలిసుకున్నాక ఫరీద్‌ను యాక్షన్‌లో దింపాం. ఫరీద్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రస్తుతం ఉన్న ఈ రూల్స్ బాగున్నాయి. ఈరోజు మా ఆట కూడా సంతృప్తికరంగా ఉంది' అని అన్నాడు.
బెంగళూరులో రో'హిట్'- అఫ్గాన్‌పై భారత్ 'సూపర్' విక్టరీ
5వ సెంచరీతో రోహిత్ వరల్డ్ రికార్డ్- చిన్నస్వామి స్టేడియమంతా హిట్‌మ్యాన్ నామమే