ETV Bharat / sports

సన్​రైజర్స్​ బ్యాటింగ్​ కోచ్​గా లారా.. కొత్త కోచింగ్​ టీమ్​ ఇదే

author img

By

Published : Dec 23, 2021, 4:07 PM IST

Sunrisers Hyderabad Batting coach: ఐపీఎల్​ 2022 దగ్గర పడుతున్న నేపథ్యంలో తమ జట్టుకు సంబంధించిన కొత్త సిబ్బంది వివరాలను తెలిపింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. విండీస్​ దిగ్గజం బ్రియన్​ లారాను బ్యాటింగ్​ కోచ్​గా నియమించినట్లు పేర్కొంది. ఇంకా ఎవరెవరిని తీసుకుందంటే..

సన్​రైజర్స్ బ్యాటింగ్​ కోచ్​గా బ్రియన్​ లారా,   sunrisers batting coach brian lara
సన్​రైజర్స్ బ్యాటింగ్​ కోచ్​గా బ్రియన్​ లారా

Sunrisers Hyderabad Batting coach: ఐపీఎల్​ 2022 నేపథ్యంలో సన్​రైజర్స్​ హైదరాబాద్​ తమ జట్టుకు సంబంధించిన సిబ్బందిలో కొన్ని మార్పులు చేస్తూ కొత్త వివరాలను ప్రకటించింది. వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్​ లారాను బ్యాటింగ్​ కోచ్​గా నియమించినట్లు పేర్కొంది. డేల్​ స్టెయిన్​ను పేస్​ బౌలింగ్​ కోచ్​గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

ఆర్సీబీ మాజీ హెడ్​ కోచ్​ సైమన్​ కటిచ్​ను అసిస్టెంట్​ కోచ్​గా, హెమంగ్​ బదానీని(Hemang badani) ఫీల్డింగ్​ కోచ్​గా, టామ్​ మూడీని హెడ్​ కోచ్​గా తీసుకున్నట్లుగా ఎస్​ఆర్​హెచ్​ తెలిపింది. స్పిన్​ బౌలింగ్​ కోచ్​గా వ్యవహరిస్తున్న శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్​తో తమ ప్రయాణం కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది.

కాగా, సారథి కేన్​ విలియమ్సన్​, ఉమ్రన్​ మాలిక్​, అబ్దుల్​ సమద్​ను రిటెయిన్​ చేసుకున్నట్లు ఇటీవలే వెల్లడించింది జట్టు యాజమాన్యం.

ఇదీ చూడండి: IPL 2022: అహ్మదాబాద్​ ఫ్రాంచైజీకి లైన్​క్లియర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.